బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో తొమ్మిదోవారం నామినేషన్ ప్రక్రియ వరుసగా రెండో రోజూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఎక్కువ ఓట్లు పడ్డవారు నేరుగా నామినేట్ కాకుండా బిగ్‌బాస్ వారికి మరో అవకాశమిచ్చినట్లు కనిపిస్తోంది. తలపై ఎక్కువ గుడ్లు పడ్డ అభిజిత్, మోనాల్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ ఒక్కో స్టాండ్ మీద తల పెట్టి నిల్చున్నారు. వీరిని మిగతావాళ్లు డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నీళ్లు, గడ్డి పరక, ఐస్ గడ్డలు కూడా వాడుకోవచ్చు. దీంతో అరియానా అందరిపై నీళ్లు గుమ్మరిస్తోంది. లాస్య.. అవినాష్‌ను ఇబ్బంది పెడుతోంది. మెహబూబ్, సోహైల్ కూడా అందరినీ నానారకాలుగా హింసిస్తున్నారు ఒక్క అమ్మ రాజశేఖర్‌ను తప్ప. పైగా ఈ ఇద్దరూ అమ్మ రాజశేఖర్‌పై ఈగ వాలనివ్వకపోవడం గమనార్హం. ఇది చూసిన అఖిల్‌కు కోపం నషాళానికంటింది. మరోవైపు తన కళ్ల ముందే మోనాల్‌పై నీళ్లు గుమ్మరిస్తూ హింసించడం తట్టుకోలేకపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
మాస్టర్ దగ్గరకు వెళ్లి ముఖంపై ఐస్ గడ్డలు వేసేందుకు ప్రయత్నించాడు. కానీ అతని గుడ్డి శిష్యులైన మెహబూబ్, సోహైల్ అఖిల్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మాస్టర్‌ను కాపాడుకుంటూ ఆయన ముఖాన్ని పూర్తిగా వస్త్రంతో కప్పేశారు. దీంతో అఖిల్‌కు మండింది. చెప్తా.. ఒక్కొక్కడికి, ఆడుకోండ్రా అని సీరియస్ అయ్యాడు. ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వు అని సోహైల్ అనడంతో ఎవడు స్టార్ట్ చేసిండు బే అని అఖిల్ ఛాతీ విరుస్తూ ముందుకెళ్లాడు. సహనం తప్పిన సోహైల్ బే అనకు అని అఖిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ గొడవపై చాలామంది నెటిజన్లు సోహైల్‌ను తప్పు పడుతున్నారు. కన్నింగ్ మాస్టర్‌కు సోహైల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అఖిల్-మోనాల్ గొడవ: అగ్నికి ఆజ్యం పోస్తున్న మాస్టర్?)
అలాగే మోనాల్‌ను నామినేట్ చేసి ఇప్పుడేమో ఆమె ఇబ్బంది పడుతుంటే అఖిల్ ఎందుకు చూడలేకపోతున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అఖిల్, సోహైల్ గొడవ పెట్టుకోవడం ఏమీ బాలేదని మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇంతకుముందు చాక్లెట్ విషయంలో మాస్టర్ వల్లే అభిజిత్, హారిక మధ్య గొడవ రాజుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అతడి వల్లే సోహైల్, అఖిల్ గొడవపడుతుండటంతో చాలామంది మాస్టర్‌ను ఆడిపోసుకుంటున్నారు. అమ్మ రాజశేఖర్‌ను సేఫ్ చేసేందుకే ఈ టాస్కు పెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అతడిని సేవ్ చేసుకుంటూ వెళ్తే మున్ముందు బిగ్‌బాస్ ఎవరూ చూడరని చెప్పుకొస్తున్నారు. మాస్టర్‌ను బిగ్‌బాస్ దత్తత తీసుకున్నాడా, ఏంటి? ఈ గేమ్ అంతా ఎందుకు? అతడికే టైటిల్ ఇచ్చేయండి అని ఆవేశపడుతున్నారు. కాగా గతవారం తక్కువ ఓట్లు వచ్చిన మాస్టర్‌ను నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించడాన్ని కూడా పలువురు తప్పు పడుతున్నారు (చదవండి: మోనాల్ ముద్దు.. అవినాష్‌కి పిల్ల దొరికేనా!)
Comments
Please login to add a commentAdd a comment