Bigg Boss Dethadi Harika Counter Reply To Netizen Comment, Goes Viral - Sakshi
Sakshi News home page

Alekhya Harika: పళ్లు తోముకోనట్లుంది, అందుకే చస్తున్నారంటూ దేత్తడి పాపపై సెటైర్‌

Published Mon, Jan 9 2023 9:12 PM | Last Updated on Tue, Jan 10 2023 10:45 AM

Alekhya Harika Counter to Netizen - Sakshi

తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే దేత్తడి హారిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది. షార్ట్‌ ఫిలింస్‌, యూట్యూబ్‌ వీడియోలతో హల్‌చల్‌ చేసే ఆమె బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొని అందరినీ అలరించింది. ప్రస్తుతం తన పేరిట ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి దానిద్వారా అభిమానులకు కావాల్సిన రీతిలో ఆడియో, వీడియో విషెస్‌ చెప్తూ డబ్బులు సంపాదిస్తోందీ బ్యూటీ.

ఇక సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసే ఫోటోషూట్స్‌, రీల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆమె 'ఒక కొంటెపిల్లనే చూశా.. సెంటిమీటర్‌ నవ్వమని అడిగా.. తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే..' పాటకు రీల్‌ చేసింది. నీలిరంగు చీరలో చిరునవ్వు విసురుతూ కవ్వించింది దేత్తడిపాప. ఇది చూసిన ఓ నెటిజన్‌ వందమంది చనిపోయారంటే నువ్వు సరిగా బ్రష్‌ చేసుకోలేదేమో అని సెటైర్‌ వేశాడు. దీనికి హారిక స్పందిస్తూ.. అబ్బే ఏం పేలలేదు అని కౌంటరిచ్చింది. చాలామంది ఇలాగే వెటకారంగా కామెంట్లు చేస్తుండేసరికి ఏకంగా కామెంట్‌ సెక్షన్‌నే ఆఫ్‌ చేసుకుంది హారిక.

చదవండి: 20 తులాల బంగారం వేసుకుని తిరిగేదాన్ని, చివరికి తిండి లేక..: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement