Bigg Boss Fame Dethadi Harika Beautiful Home Tour: అలేఖ్య హారిక.. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిందీ తెలంగాణ పిల్ల. దేత్తడి ఛానల్‌లో ఆమె చేసే వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అవకాశం రావడం.. వెంటకే ఓకే చెప్పేయడం, అక్కడ టాస్కుల్లో విజృంభిస్తూ శివంగిగా పోరాడటం ఆమెను మరింత పాపులర్ చేశాయి. ప్రస్తుతం షార్ట్ ఫిలింస్, సాంగ్స్, సరదా వీడియోలతో ఫుల్ బిజీగా ఉంది హారిక. ఇదిలా వుంటే తాజాగా దేత్తడి పాప ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ ఆమె తల్లి హోమ్ టూర్ వీడియో చేసింది. మరి ఆమె ఇంటి విశేషాలేంటో చూసేద్దాం..
హారిక ఇంట్లో హాల్, కిచెన్, పూజ గది, మూడు పడక గదులు, రెండు బాల్కనీలు, చిన్నపాటి స్టోర్ రూమ్ ఉన్నాయి. ఏ గదికాగది శుభ్రంగా సర్దేసినట్లుగా ఉంది. హారికకు ఇల్లు సర్దేంత ఓపిక ఉండదు కాబట్టి అన్నీ తానే నీట్‌గా సర్దుతానని చెప్తోంది ఆమె తల్లి. దాదాపు ప్రతి గదిలోనూ హారిక ఫొటోలే కనిపించాయి. మరీ ముఖ్యంగా అభిమానులిచ్చిన ఫొటోలను ఎంతో భద్రంగా దాచుకుందీ దేత్తడి పాప. షూటింగ్స్‌తో బిజీగా ఉండే హారిక ఖాళీ సమయాల్లో పెయింటింగ్ కూడా వేస్తుందట! ఆమె బెడ్‌రూమ్‌లో తను గీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. బిగ్‌బాస్ షోకు గుర్తుగా హౌస్‌లోని నీటి జార్‌ను, నామినేషన్స్‌లో వాడే ఫొటోను, తనకిచ్చిన ఫిదా టైటిల్‌ను ఇంటికి తెచ్చేసుకుని దాచుకుంది.
'షో మస్ట్ గో ఆన్..' పాట హారికకు ఇష్టమని, త్వరలోనే దాన్ని టాటూ వేయించుకోబోతుందన్న విషయాన్ని అభిమానులకు లీక్ చేసింది ఆమె తల్లి. నిజానికి తనకు ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడాలు ఇష్టం లేకపోయినా.. తన కూతురికి ఆ సాంగ్ అంటే తెగ ఇష్టం కావడంతో ఈసారికి తనెలాంటి అభ్యంతరం తెలపడం లేదంటోంది.
బిగ్‌బాస్ నుంచి వచ్చాక సైకిల్ కొనివ్వమని సోహైల్‌ను అడిగిందట హారిక! కానీ అతడు కొనిచ్చేలోపే తనే వెళ్లి ఓ సైకిల్‌ను ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. కొత్త మురిపెంతో రెండు మూడు రోజులు దాన్ని వాడిందని, కానీ బయట సైకిల్ తొక్కడం వల్ల ముఖం నల్లగా అయిపోతుందని దాన్ని మూలనపడేసిందని చెప్పుకొచ్చింది. అలాగే హారికకు ఇప్పటివరకు వచ్చిన అవార్డులన్నింటినీ వీడియోలో చూపించింది. మీరూ ఆమె ఇంటిని చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment