![Bigg Boss 4 Telugu: Abhijeet Fires On Harika Over BB Daycare Task - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/28/harika%20abhijeet.jpg.webp?itok=vaqNv5ky)
బిగ్‌బాస్ హౌస్‌లో 50 రోజులు దాటినా ఇప్పటికీ ఫిజికల్ టాస్కులు చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో పోటీ లేని ఫైట్లు పెట్టే బదులు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే టాస్కులు పెడదామనుకున్నాడు బిగ్‌బాస్. అలా ఇంటిసభ్యులకు బీబీ డేకేర్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్, అమ్మ రాజశేఖర్ చిన్నపిల్లల్లా మారిపోయి తెగ అల్లరి చేస్తూ హౌస్‌ను దద్దరిల్లేలా చేశారు. వారి పిచ్చి చేష్టలను భరిస్తూ లాలించడం డేకేర్లకు కత్తి మీద సాముగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు కొందరు అది బిగ్‌బాస్ హౌసా? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రా? అని విమర్శిస్తున్నారు. మరీ ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే వాళ్లు సరదాగా చేసిన అల్లరి నేడు గొడవలకు కారణమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మా ఆయనేంటో నాకు తెలుసు: మాస్టర్ భార్య ఫైర్)
పెన్సిల్ గొడవలో దెబ్బలు తగిలించుకున్నారు
పిల్లలంటేనే చిలిపిచేష్టలు, అల్లరి, గిల్లికజ్జాలు, మారాం చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొంటె పిల్లగా మారిన హారిక.. అమ్మ రాజశేఖర్‌ను పదేపదే ఏడిపించసాగింది. ఆయన కూడా గుక్కపెట్టి నోట్లో వేలేసుకుని ఏడ్చినట్లు నటించాడు. తర్వాత మాస్టర్ హారిక దగ్గర నుంచి పౌచ్ దొంగిలించాడు. అప్పుడు ఇద్దరికీ తగవులాట జరిగింది. ఇది పూర్తవగానే హారిక.. అరియానా దగ్గర పెన్సిల్ లాక్కుని మరో గొడవ రాజేసింది. అయితే తన వస్తువు లాక్కుంటే అరియానా ఊరుకుంటుందా.. మీద పడి మరీ తీసుకోవడంతో హారికకు దెబ్బలు తగిలాయి. (చదవండి: పట్టపగలే చుక్కలు చూపించిన అరియానా)
పంచాయితీకి దారి తీస్తున్న అల్లరి పనులు
ఇక ఈ పిల్ల గొడవలు నేడు పెద్ద తగాదాలుగా మారనున్నట్లు కనిపిస్తోంది. దొంగతనం గురించి తెలియకపోతే మధ్యలో రాకు అని మాస్టర్ మోనాల్ మీద అరిచాడు. ఇక హారికపై కూడా అభి ఫైర్ అయ్యాడు. పాకెట్లలో నుంచి తీసుకోవడమంటే లాక్కోవడమా? దొంగతనమా? అని అడిగాడు. అది అప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది అని హారిక కౌంటర్ వేయడంతో నేనెప్పుడు మాట్లాడాలో నువ్వు నాకు నేర్పకు అని సీరియస్ అయ్యాడు. నేనేమైనా బేకార్ గాడినా, నీతో కూర్చుని మాట్లాడటం తప్పితే వేరే పనిలేదా? అని నోటికొచ్చినట్లు అంటున్నాడు. అభి అంత కఠినంగా మాట్లాడతాడని కలలో కూడా ఊహించని హారిక వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. మరి ఈ గొడవ సద్దుమణుగుతుందా? లేదా? అనేది తెలియాంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment