బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఇప్పుడు మూడు జంటలు మాత్రమే మిగిలాయి. అది అభిజిత్- హారిక, అఖిల్-మోనాల్, సోహైల్-అరియానా. వీరిలో సోహైల్ జంట ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకోవడానికే సరిపోతుంది. మరోవైపు అఖిల్ జోడీ మధ్య దూరం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలింది అభిక జోడీ. మొదటి నుంచి కలిసి ఉన్న ఈ జోడీ ఈ మధ్య పెద్దగా కలిసి కనిపించడం లేదు. నీకోసం ఎప్పుడూ నేనుంటా అని చెప్పిన హారిక ఈ మధ్య అభితో ఎక్కువ సమయం గడపట్లేదు. నాగార్జున వచ్చినప్పుడు కూడా అభి ఇదే విషయాన్ని చెప్తూ కాస్త డల్‌గా ఫీలయ్యాడు. చూస్తుంటే అభిజిత్ చెప్పింది కూడా నిజమేననిపిస్తోంది. ఎప్పుడూ అతడితో మాత్రమే ఉండే హారిక ఇప్పుడు అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా అఖిల్‌తో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది అభిజిత్ అభిమానులకు బొత్తిగా నచ్చడం లేదు.
అభిని వదిలేసి, అఖిల్‌తో..
నిన్నటి టాస్కులో మహారాణిగా అవతారమెత్తిన హారిక తను పిలవగానే అభి రాలేదని అతడి బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. అది చూసిన అభి ఆమెపై ఏ మాత్రం కోప్పడలేదు. అవి నోయల్ బట్టలు అని ఆమెకు వివరణ ఇచ్చాడు. పైగా హారిక అనుమతి తీసుకుని ఆ బట్టలను నీళ్లలో నుంచి బయటకు తీసి ఆరేశాడు. అయితే హారిక కావాలనే అభి మీద కోపాన్ని చూపిస్తోందని కొందరు తప్పులో కాలేస్తున్నారు. హారిక తీరు ఈ మధ్య అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అభిజిత్‌కు దూరంగా ఉండటంపై ఆయన అభిమానులు కొందరు గుర్రుగా ఉన్నారు. ఇన్ని వారాలు అభితో ఉండి, ఇప్పుడు మాత్రం అతడిని ఒంటరిగా వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఓట్లు వేసేదే లేదని తేల్చి చెప్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అందరికీ దూరంగా నోయల్)
గంట ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయకండి: నోయల్
ఈ ట్రోలింగ్‌పై హారిక ఫ్యాన్స్ కూడా ధీటుగా సమాధానమిస్తున్నారు. 'అభితో మాత్రమే ఉంటే ఎవరితో కలవట్లేదని తిడతారు, ఇప్పుడు అందరితో కలిస్తే అభిని వదిలేసిందని ట్రోల్ చేస్తారు, ఆమె ఏం చేసినా నిందిస్తారా?' అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. 'ఒకరితో క్లోజ్‌గా ఉన్నట్లు చూపించినంత మాత్రాన అభితో ఉండట్లేదని ఎలా అనుకుంటారు?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హారికను టార్గెట్ చేయడంపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నోయల్ సైతం స్పందించారు. అభిజిత్, హారికల బంధం ఎలాంటిదో తనకు తెలుసని, ఒక్క గంట ఎపిసోడ్ చూసి వారిని జడ్జ్ చేయకండని కోరాడు. కేవలం టాస్క్‌లో భాగంగానే హారిక తన బట్టలను నీళ్లలో పడేసిందని స్పష్టం చేశాడు. (చదవండి: సోహైల్ చేస్తే ఒప్పు? హారిక చేస్తే తప్పా?)
Comments
Please login to add a commentAdd a comment