
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదిహేనో వారంలో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరు ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ, సమస్యలకు ఎదురీదుతూ ప్రీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ముందైతే టాప్ 5లో అర్హత సాధించాలని కలలు నెరవేరడంతో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక, అరియానా ఇప్పుడు కప్పు గెలిచేందుకు తాపత్రయపడుతున్నారు. వీరి గెలుపు అంతా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంది. ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నరప్‌గా నిలుస్తారో అనేది తేలడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఫైనలిస్టులతో ఓ ఆటాడించాడు. (చదవండి: బిగ్‌బాస్: నెరవేరని మోనాల్ కల!)
ఇప్పుడున్న ఐదుగురిలో విజేత అవడానికి అర్హత లేని ఇంటి సభ్యుడి పేరు చెప్పమని ఆదేశించాడు. దీంతో అభిజిత్.. హారిక అర్హురాలు కావద్దు అనుకుంటున్నానని చెప్పి బాంబు పేల్చాడు. అయితే హారిక విజేత అయ్యేందుకు అర్హురాలు కాదన్నాడా? లేదా చివరలో ఉండేందుకు అర్హురాలు కాదన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్, హారిక.. టైటిల్ గెలిచేందుకు అరియానా అనర్హురాలని అభిప్రాయపడ్డారు. అందరూ తనను అర్హురాలు కాదని గుచ్చిగుచ్చి చెప్పడాన్ని అరియానా పాజిటివ్‌గా తీసుకుంది. "నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇక్కడే తెలిసిపోతుంది. అందరి బుర్రలోకి దూరానంటే నేను గేమర్‌ను అని అర్థం. ఇది నాకు సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. మరి ఈ గేమ్ పూర్తయ్యేసరికి ఎవరిని అనర్హురాలిగా ప్రకటించారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్‌ను కాదని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్కర్)
Comments
Please login to add a commentAdd a comment