
నామినేషన్స్‌తో కాక మీదున్న హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ "పల్లెకు పోదాం చలో చలో" అనే టాస్కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో గ్రామ పెద్దగా సోహైల్, ఆయన భార్యగా లాస్య నటిస్తున్నారు. మాస్టర్ లాస్యను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మెహబూబ్ రౌడీయిజం చూపించనున్నాడు. చూస్తుంటే అతడు హౌస్‌లో విలన్‌గానే స్థిరపడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. రాక్షసుల టాస్క్ నుంచి అతడికి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలనే ఇస్తున్నారు. ఈ క్రమంలో నేటి పల్లె టాస్కులో కూడా మెహబూబ్ విలన్‌గా విధ్వంసం సృష్టించనున్నాడని ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక అవినాష్ పాన్ షాపును నడుపుకునే వ్యక్తిలా జీవిస్తున్నాడు. పనిలో పనిగా గ్రామ పెద్ద కూతురు అరియానాను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (చదవండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్)
ఈ వేషాలు కళ్లారా చూసిన సోహైల్ కళ్లు ఎరుపెక్కాయి. దీంతో అవినాష్ అతడి కాళ్లు పట్టుకుని బతిమాలాడు. అయినా సరే కనికరించని సోహైల్.. తన కూతురిని పటాయించాలని చూస్తే ఊర్లో నుంచి బహిష్కరిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా వుంటే సినిమా టాస్కులో మోనాల్, అఖిల్‌ను ప్రేమికులుగా చూడలేకపోయిన అభిజిత్‌కు బంపరాఫర్ లభించింది దొరికింది. మోనాల్‌కు భర్తగా నటించే ఛాన్స్ దక్కింది. టాస్కులో భాగంగా బిగ్‌బాస్ పల్లెలో ఓ హత్య కూడా జరిగింది. దీంతో అందరికీ రౌడీ రాజా మెహబూబ్ మీదే అనుమానం వస్తోంది. మరోవైపు హారికకు బిగ్‌బాస్ సీక్రెట్ ఇచ్చాడు. ఈ అవకాశం కోసం ఎన్నాళ్లుగా ఎదురు చూస్తుందో ఏమో కానీ సీక్రెట్ టాస్క్ అనగానే ఆమె సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. మరి బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటి? దాన్ని దేత్తడి విజయవంతంగా పూర్తి చేసిందా? లేదా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: చాక్లెట్ లొల్లి: అభి హారిక మధ్య చిచ్చు పెట్టింది)
Comments
Please login to add a commentAdd a comment