
ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారిన బీబీ డేకేర్ టాస్క్‌కు బిగ్‌బాస్ శుభంకార్డు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్కులో చంటిపిల్లలా మారిన హారిక అమ్మ రాజశేఖర్ దగ్గర చాక్లెట్లు కొట్టేసింది. దీంతో అతడు పెద్ద సీనే క్రియేట్ చేశాడు. హారిక స్నేహితుడు అభిజిత్ కూడా ఆమె వైఖరిని తప్పుపట్టి నిందించడం గమనార్హం. దీంతో హర్టైన హారిక కన్నీళ్లు పెట్టుకుంటూ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతని చాక్లెట్‌ను తిరిగిచ్చేసింది మరోవైపు మెహబూబ్ పిల్లాడిలా నవ్వుతూ అరియానాకు పదే పదే ఐ లవ్ యూ చెప్పడం గమనార్హం. (చదవండి: బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశల్)
ఇక టాస్క్‌లో ఆడుకుంది చాలదని నేడు అవినాష్ ఇంటిసభ్యులను ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. హారికను చూసి వావ్ అని పొగుడుతూ చివర్లో తాను పరోటా బాగుంది అన్నానని పంచ్ వేశాడు. తన జుట్టు ఏమైనా పెరిగిందా? అని హారిక అడగ్గా, ఘోరంగా పెరిగిందంటూ అవినాష్ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆమె రెండు తగిలించి బుద్ధి చెప్పింది. మాస్టర్‌తో కలిసి మోనాల్ దగ్గరకు వెళ్లి పులిహోర కలుపుదామని ప్రయత్నించాడు. ఇంతకీ బ్రష్ చేశావా? లేదా అంటూనే తలకు నూనె పెట్టుకుందని అక్కడి నుంచి జారుకున్నారు. మరి అందరినీ ఆడుకుంటున్న ఈ ఇద్దరికీ ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి. (చదవండి: సమంత హోస్టింగ్‌పై నెటిజన్ల రియాక్షన్!)
Comments
Please login to add a commentAdd a comment