సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే రేపటి స్టార్లు.. ఈ మాటను ఎప్పుడో రుజువు చేసి చూపించింది దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక. సాంగ్ ఆల్బమ్స్, రీల్స్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసే ఈ బ్యూటీ పలు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చేసింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో టాప్ 5 వరకు చేరుకుని తన సత్తా చూపించింది.
సినిమాల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే తను త్వరలోనే హీరోయిన్‌గానూ వెండితెరపై కనిపించనుంది. బేబి ఫేమ్ సాయి రాజేశ్ డైరెక్షన్‌లో సంతోష, హారిక హీరోహీరోయిన్లుగా నిస్తున్నారు. మొత్తానికి చాలాకాలానికి హారిక పంట పండిందని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది దేత్తడి పాప.
తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు కొత్తింటి కల సాకారమైనందుకు సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంటికి వచ్చినవారిని వట్టి చేతులతో పంపించకుండా బహుమతులు కూడా అందించింది.
చదవండి: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment