ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక.. | Pallavi Prashanth Receives Rs.15 Lakh Worth Jewellery After 5 Months Of Bigg Boss, Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Pallavi Prashanth: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్‌!

Published Fri, May 10 2024 1:35 PM

Pallavi Prashanth Receives Rs.15 Lakh Worth Jewellery

బిగ్‌బాస్‌ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్‌పై ఆసక్తి పెంచాడు కింగ్‌ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ బాగానే వర్కవుట్‌ అయింది. ఈ సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలవగా నటుడు అమర్‌దీప్‌ చౌదరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

ప్రైజ్‌మనీతో పాటు
విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్‌కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్‌కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్‌ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. 

అమ్మకు తొలి కానుక
షో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్‌కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌కు థ్యాంక్స్‌.. లవ్‌యూ నాగ్‌ సర్‌..' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్‌ వైరల్‌గా మారింది.

 


చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్‌.. బాబు ఊయల ఫంక్షన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement