గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్‌కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు.
ప్రశాంత్ రాకతో వీరంగం
అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.
రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు
బెయిల్‌లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి..
Comments
Please login to add a commentAdd a comment