విన్నర్‌ గురించి హింట్‌ ఇచ్చిన దీప్తి సునయన? దేత్తడి హారిక ఫైర్‌! | Bigg Boss Telugu 5: Deepti Sunaina, Dethadi Harika Hints About Winner | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హింట్‌ ఇచ్చిన దీప్తి సునయన, స్టార్‌ మాది చెత్త నిర్ణయం అంటున్న దేత్తడి హారిక!

Published Sat, Dec 18 2021 7:04 PM | Last Updated on Sun, Dec 19 2021 11:55 PM

Bigg Boss Telugu 5: Deepti Sunaina, Dethadi Harika Hints About Winner - Sakshi

Bigg boss 5 Telugu: బిగ్‌బాస్‌ విజేత ఎవరై ఉంటారు? సన్నీ గెలిచాడా? లేదా యూట్యూబ్‌ స్టార్‌ షణ్ను గెలిచాడా? అబ్బే.. సింగర్‌ శ్రీరామ్‌ ట్రోఫీ సాధిస్తాడేమో, సిరి, మానస్‌ ముందే ఎలిమినేట్‌ అయిపోతారేమో! ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నిన్నటిదాకా ఓటింగ్‌ వేస్తూ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడానికి నానాతంటాలు పడ్డ బుల్లితెర ప్రేక్షకులు రిజల్ట్‌ ఏమని వస్తుందా? అని ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారు.

అనఫీషియల్‌ ఓటింగ్‌లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది కానీ ఇదే నిజమని పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే కొన్ని షాకింగ్‌ ఎలిమినేషన్లతో బిగ్‌బాస్‌ మనం ఊహించనివి కూడా చేసి చూపిస్తాడని నిరూపించాడు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం సన్నీ విన్నర్‌ అని, షణ్ముఖ్‌ ట్రోఫీ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడని పుకార్లు మొదలయ్యాయి. ఇది షణ్ను ప్రేయసి దీప్తి సునయన కంట కూడా పడిందో ఏమో కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ పెట్టింది.

'జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్‌ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఇక బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ కంటెస్టెంట్‌ దేత్తడి హారిక అయితే ఏకంగా స్టార్‌ మాను తిడుతూ పోస్ట్‌ పెట్టింది. ఇది చెత్త నిర్ణయం స్టార్‌ మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌తో వీక్షకుల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఇంతకీ ఎవరు గెలిచారని హారిక అలా పోస్ట్‌ పెట్టిందని గుసగుసలు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement