Shanmukh Father Shocking Comments on Shanmukh and Deepthi Sunaina Breakup - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth Father: నా కొడుకు బ్రేకప్‌ చెప్పలేదు, వాళ్లు కలుస్తారు

Published Thu, Jan 13 2022 6:53 PM | Last Updated on Thu, Jan 13 2022 7:54 PM

Shanmukh Father Shocking Comments on Shanmukh and Deepthi Sunaina Breakup - Sakshi

షణ్ముఖ్‌ జశ్వంత్‌- దీప్తి సునయన.. వీళ్లిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే అభిమానులు ఎంతమందో! కానీ ఒక్కసారి బ్రేకప్‌ చెప్పుకున్నాక కలవడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నాడు షణ్ముఖ్‌ తండ్రి. వాళ్లు కలుస్తారని అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్‌ తండ్రి మాట్లాడుతూ.. 'వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. బ్రేకప్‌ దీప్తి చెప్పింది, కానీ షణ్ముఖ్‌ ఎక్కడా చెప్పలేదు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్‌ మీడియాలో అలా పోస్ట్‌ పెట్టింది..'

'వాళ్లు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కలిసే ఉంటారు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.. అంతా శుభమే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇద్దరం మాట్లాడుకున్నాకే ఓ నిర్ణయానికి వచ్చి విడిపోతున్నామన్న వీళ్లిద్దరూ నిజంగా కలుస్తారా? లేదా? అన్నది రానున్న రోజుల్లో చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement