
ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పెద్ద ఎనర్జీగా ఉన్నట్లు కనిపించడం లేదు. అనవసరమైన విషయాలకు రాద్ధాంతం చేయడం, చిల్లర గొడవలకు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తున్నాయి. అయితే ఉదయం మాత్రం దాదాపు అందరూ కంటెస్టెంట్లు డ్యాన్సులు చేస్తున్నారు. ఫిట్‌నెస్ వీరులు ఎలాగో డ్యాన్స్ అవగానే కాసేపు వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే గంగవ్వ మాత్రం అటు డ్యాన్స్ చేస్తూ ఇటు డంబెల్స్ ఎత్తి ఎక్సర్‌సైజ్ చేస్తూ రెండింటికి సమన్యాయం చేస్తోంది. అవ్వ హుషారును చూసి కంటెస్టెంట్లే ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు అందరూ పాటకు తగ్గట్టు స్టెప్పులేశారు. (చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు గంగవ్వ మాటలు)
ఆ తర్వాత నోయల్.. ముద్దు పెట్టే అని అవ్వను అడగ్గానే గంగవ్వ గాల్లో ముద్దులు పంపించింది. ఇక నీ దగ్గరున్న చీరలు ఇచ్చేయమంటున్నారని దేత్తడి హారిక అవ్వతో చెప్పింది. అందుకు అవ్వ 'నేనెందుకు ఇస్తా?' అని రివర్స్ పంచ్ వేసింది. దీంతో అక్కడున్న లాస్య పడీపడీ నవ్వింది. అయినా అవ్వ జోరును, హుషారును తట్టుకోవడం బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి తరమూ కావడం లేదు. ఆమె వేసే పంచులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమే తప్ప రివర్స్ పంచ్‌లు వేసే సాహసం చేయడం లేదు. (చదవండి:బిగ్‌బాస్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదు! )
Manchi flow lo unnaru antha...special ga mana #Gangavva josh 👌 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gaDfh7WVyj
— starmaa (@StarMaa) September 9, 2020
Comments
Please login to add a commentAdd a comment