
నల్గొండ: గుర్రంపోడు మండలం కొత్తలాపురం గ్రామానికి చెందిన కట్టెబోయిన అలేఖ్య నిడమనూరు ఆదర్శ పాఠశాలలో చదువుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కేన్సర్‌తో బాధపడుతూ ఫిబ్రవరి 11న మృతిచెందింది.
ఆమె తండ్రి వారిని వదిలి వెళ్లిపోయాడు. ‘పది’లో సత్తా చాటిన విద్యార్థిని, అలేఖ్యకు బాసటగా నిలుస్తాం అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాలకు పలువురు దాతలు స్పందించి ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పటాన్‌చెరువు సీఐ నూకల వేణుగోపాల్‌రెడ్డి తాను చేపట్టిన వన్ చాలెంజ్ ద్వారా హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్న కట్టెబోయిన అలేఖ్యను బుధవారం కలిసి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు.
సాయం అందిచాలనుకునే వారు:
కట్టెబోయిన అలేఖ్య
యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్)
A/C NO: 194612120000001
IFSC CODE:UBIN 0819468