తన ముక్కుసూటి తత్వంతో ఇంటిసభ్యులతో వైరాన్ని పెంచుకుంది దేవి నాగవల్లి. మూడు వారాల్లో ఆమె మారిందో, ఇంటి సభ్యుల్లో తనపై అభిప్రాయాన్ని మార్చిందో తెలీదు కానీ ఆమె వెళ్లిపోతుంటే ఎందరో ఇంటి సభ్యులు ఏడ్చేయడం, ఎలిమినేషన్‌ను ఊహించని ఆమె కూడా స్థాణువులా మారిపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదేమైనా మరీ మూడో వారంలోనే బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్, పవర్‌ఫుల్ కంటెస్టెంటును కోల్పోయింది. ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగిన ఎపిసోడ్ తర్వాత బరువెక్కిన హృదయాలతో భారంగా నడిచింది. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేసేయండి..
బిగ్‌బాస్ రికార్డులు, మెహబూబ్ సేఫ్
ఇంట్లో కొత్తగా బిగ్‌బాస్ రికార్డ్స్ ప్రవేశపెట్టారు. అందులో భాగంగా కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించారు. చూస్తుంటే ఈ రికార్డులు తర్వాత సీజన్‌లోనూ కొనసాగేటట్లు కనిపిస్తున్నాయి. ఇక బెలూన్లను కూర్చుని పగలగొట్టే ఆటలో మాస్టర్ విజేతగా నిలవగా అభిజిత్ ఓడిపోయాడు. టాయ్‌లెట్ పేపర్లతో టవర్ కట్టే ప్రోగ్రామ్‌లో లాస్య, దేవి ఇద్దరూ విఫలమయ్యారు. నోట్లో సోహైల్ కన్నా ఎక్కువ స్ట్రాలు పెట్టుకుని కుమార్ సాయి తొలిసారి విజయం సాధించాడు. నిమిషంలో 14 సాక్సులు తొడుక్కున్న హారిక కన్నా ఒకటి ఎక్కువే తొడగడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ గెలిచింది. స్కిప్పింగ్ పోటీలో అఖిల్ తడబడగా మెహబూబ్ విజేతగా నిలిచాడు. ఎక్కువ బ్రెడ్ స్లైసులు తినే పోటీలో సుజాతను ఓడించి అవినాష్ తిండిపోతనిపించుకున్నాడు. మోనాల్ కన్నా ఎక్కువ యాపిల్స్ తిని దివి గెలిచింది. అనంతరం మెహబూబ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. (చదవండి: అభిజిత్, అఖిల్ మధ్య చిచ్చు పెట్టిన కుమార్)
నవ్వించమంటే హగ్ చేసుకున్నాడు
తర్వాత ఇంటి సభ్యులందరినీ ఒంటి కాలితో, తాగిన వాళ్లలా, టవల్ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ ఇలా పలు రకాలుగా నాట్యం చేయని నాగ్ ఆదేశించడంతో అందరూ బాగానే ఇరగదీశారు. తర్వాత నాగ్.. డ్యాన్స్ చేస్తున్న హారికను మాత్రమే ఫ్రీజ్ చేశారు. ఆమెను నవ్వించాలని మిగతా ఇంటి సభ్యులకు చాలెంజ్ విసిరారు. కానీ ఎవరి వల్లా కాకపోవడంతో ఆమెను డిస్టర్బ్ చేసే మగాడే లేడా అని ప్రశ్నిస్తూనే అభిని ఉసిగొల్పారు. నవ్వించడానికి ప్రయత్నించమంటే అతడు ఏకంగా పరుగెత్తుకొచ్చి హారికను హగ్ చేసుకున్నాడు.
దేవి ఎలిమినేట్
అనంతరం హారిక, అరియానా సేఫ్ అయినట్లు వెల్లడించారు. దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యిందని చెప్పగానే అరియానా ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. దేవి చేయి విడిచి పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. తాను వెళ్లిపోయినా ఇంత బాధపడనంటూ బోరున ఏడ్చేసింది. ఆ వెంటనే అఖిల్, మెహబూబ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవి తన శత్రువు అని చెప్పిన మాస్టర్ ఒక్కసారిగా ఏడ్చేయగా.. దేవి కూడా కంటతడి పెట్టుకుంది. దీంతో మాస్టర్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ నువ్వు ఏడవద్దని ఊరడించాడు. ఇక ఇంట్లోకి వచ్చిన వాళ్లకు మంచినీళ్లిచ్చే అలవాటున్న మోనాల్.. దేవి వెళ్లిపోతుంటే కూడా ఆమెకు నీళ్లగ్లాసు అందించింది.
ఇలాంటి అక్క కావాలి: బోరున విలపించిన అరియానా
తర్వాత దేవితో నాగ్ గేమ్ ఆడించారు. ఒక్కో వస్తువును ఒక్కో కంటెస్టెంటుకు అంకితం చేయాలన్నారు. అలా అఖిల్.. తనను తాను చెక్కుంటున్న శిల్పి అని, ఒకవేళ వేరే దారిలో వెళ్తున్నావనిపిస్తే శిక్షించుకో అంటూ కొరడా ఇచ్చింది. తర్వాత బలమైన పునాది అవుతాడంటూ అభికి ఇటుకను ఇచ్చింది. నెగెటివ్ ఆలోచనలను ఇందులో వేసేయంటూ అరియానాకు చెత్తబుట్ట ఇచ్చింది. ఈ సందర్భంగా 'ఇలాంటి అక్క కావాలి, ఈమే నా అక్క' అంటూ అరియానా మరోసారి ఎమోషనల్ అయింది. తర్వాత దివి అందాన్ని కాపాడుకోవాలంటూ సబ్బు ఇచ్చింది. సుజాత ఒకే నిర్ణయంపైన ఉండమని సలహా ఇస్తూ కెమెరా ఇచ్చింది. (చదవండి: ఎలిమినేషన్: అతడు కాదు ఆమె!)
నోయల్ ప్రతీది కామెడీ వద్దు
మీది లవ్ ట్రాక్, ఫ్రెండ్‌షిప్ ట్రాకో తెలీదు కానీ నీ ఆశయానికి కట్టుబడి ఉండమని అఖిల్‌కు దేవి సలహా ఇచ్చింది. అవినాష్ వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన కామెడీని చూశానని తెలిపింది. కుమార్ సాయి.. భయపడకుండా, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోమని సూచించింది. నోయల్‌ను ప్రతీది కామెడీగా తీసుకోకుండా కొన్నిసార్లు సీరియస్‌గా ఉండమని సలహా ఇచ్చింది. అందరితో మంచి అనిపించుకునేందుకు లాస్య ప్రయత్నిస్తోందని, ఇది కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లుగా ఉందని చెప్పింది. (చదవండి: హారిక బ్రష్ చేసుకోకుండానే టీ తాగుతుంది: గంగవ్వ)
పాట పాడుతూ అందరినీ ఏడిపించేసిన దేవి
అమ్మ రాజశేఖర్ ఈ మధ్య ద్వంద్వార్థాలు వచ్చే డైలాగ్స్ వాడట్లేదని ప్రశంసించింది. ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవద్దని మోనాల్‌కు సూచించింది. మెహబూబ్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పింది. సోహైల్ చిన్నపిల్లాడని, అందరితో ఉండటం అతనికిష్టమని పేర్కొంది. నీలో ఉన్న ఫైర్‌ను బయటకు తీసుకురా అని హారికను ఎంకరేజ్ చేసింది అనంతరం నాగ్ కోరిక మేరకు దేవి బాధను దింగమింగుకుని మరీ పాట పాడింది. 'నువ్వుంటే నా జతగా..' అని పాట పాడుతూనే అందరినీ వదిలేసి వెళ్లిపోతుండటంతో ఇంటిసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక వచ్చే వారానికిగానూ అరియానాను నామినేషన్ నుంచి సేఫ్ చేస్తూ ఆమెపై బిగ్‌బాంబ్ వేసింది. (చదవండి: దేవి నాగవల్లికి దాసరి దగ్గరి బంధువు)
Comments
Please login to add a commentAdd a comment