నామినేట్ అయిన వాళ్లకు ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు బిగ్‌బాస్ ముఖం జాగ్రత్త టాస్క్ ద్వారా అవకాశం కల్పించినప్పటికీ ఏ ఒక్కరూ దాన్ని పొందలేకపోయారు. ఫలితంగా అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్, మోనాల్ ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు. మరోవైపు అఖిల్, మోనాల్ మధ్య ఇంకా దూరం తగ్గలేదు. కానీ ఒంటరిగా ఉన్న మోనాల్‌కు అభి కంపెనీ ఇచ్చాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో జోష్ కనిపించినా ఇంటిసభ్యులు దాన్ని నీరసంగా చేస్తున్నారు. మరి ఈ టాస్కులో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషించారు? అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే ఇది చదివేయండి..
పల్లెకు పోదాం ఛలో ఛలో
బిగ్‌బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం "పల్లెకు పోదాం ఛలో ఛలో" అనే టాస్కు ఇచ్చాడు. ఈ టాస్కులో ప్రధానమైనది మండే మంటను ఆరకుండా చూడటం. గ్రామపెద్దగా సోహైల్‌ను, అతడి భార్యగా లాస్య, వీరి కూతురిగా అరియానాను నియమించాడు. ఈ తల్లీకూతుళ్లకు అమ్మ రాజశేఖర్, అవినాష్ లైన్ వేస్తుంటారు. బాధ్యత లేని గ్రామస్థుడిగా, లాస్య తమ్ముడిగా అఖిల్ పాత్ర పోషించాడు. అభి, మోనాల్ వంటమనుషులుగా మారిపోయారు. వీరికి మిగతావారు వడ్లను దంచి చెరిగిన బియ్యం ఇస్తేనే ఆహారం ఇస్తారు. (చదవండి: 'అమ్మో' రాజశేఖర్: దేని కోసం ఇంత డ్రామా?)
మూడు హత్యలు చేయమని బిగ్‌బాస్ ఆదేశం
పుకార్లు పుట్టించే అమ్మాయిగా హారిక పేరును చెప్తూ ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. రాజశేఖర్‌పై కాఫీ చల్లడం, అవినాష్‌కు కోపం తెప్పించి అరిచేలా చేయడం, చంపాలనుకునే వ్యక్తి పేరు లిప్‌స్టిక్‌తో కిటికీ మీద రాయడం వంటి మూడు హత్యలు హారిక చేయాల్సి ఉంటుంది. మాస్టర్ మీద కాఫీ పోస్తే రచ్చ అవుతుందని బిగ్‌బాస్ భావించాడు కానీ అలా జరగలేదు. ఇక పాను షాపు యజమాని అయిన అవినాష్ అరియానాను ప్రేమిస్తూ ఉంటాడు. అతడి తమ్ముడు మెహబూబ్ రౌడీయిజం చేస్తూ హారికతో లవ్ సాంగ్స్ పాడుకుంటాడు. (చదవండి: బిగ్‌బాస్ : నోయల్ రీఎంట్రీ.. సర్‌ప్రైజ్ వీడియో)
అందరికీ కన్ను గీటి సైగలు చేసిన హారిక
పల్లెటూరు టాస్క్ అని చాలామందికి పల్లె యాస మాట్లాడటానికి ప్రయత్నించారే కానీ సఫలీకృతం కాలేకపోయారు. టాస్కును కూడా పెద్దగా అర్థం చేసుకున్నట్లు కనిపించలేదు. అయితే హారిక మాత్రం పర్ఫామెన్స్ ఇరగదీసింది. మెహబూబ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూనే అబ్బాయిలందరికీ కన్ను గీటింది. అటుపక్క అరియానాను బుట్టలో వేసేందుకు నానాప్రయత్నాలు చేసిన అవినాష్‌పై సోహైల్ కన్నెర్ర జేశాడు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే బహిష్కరిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక సోహైల్, అఖిల్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను గుర్తు చేశారు. ఇద్దరూ హీరోలు మహేశ్‌బాబు, వెంకటేష్‌లా ఫీల్ అయి కాసేపు వాదులాడుకున్నారు. అఖిల్ అలగడంతో సోహైల్ వెళ్లి బుజ్జగించాడు. అయినా సరే అఖిల్ కనీసం స్పందించకుండా అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించాడు.
తిండి కోసం మెహబూబ్ ఆగ్రహం
తర్వాత హారిక సరైన సమయం చూసుకుని మాస్టర్ మీద టీ గుమ్మరించి అనుకోకుండా పడిపోయినట్లు సారీ చెప్పింది. ఇక్కడ అభిజిత్‌కు అనుమానం వచ్చింది కానీ హారిక టాపిక్ డైవర్ట్ చేసి తప్పించేసుకుంది. ఆ తర్వాత మీ గ్రామంలో ఒక హత్య జరిగిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. తర్వాత తనకు భోజనం పెట్టడం లేదని మెహబూబ్ నీళ్లతో మంటను ఆర్పే ప్రయత్నం చేశాడు. దీంతో సోహైల్ మగ్గును కాళ్లతో తన్నేయగా అతడు నిప్పు పెట్టేందుకు అవసరమయ్యే వంటచెరుకును దొంగిలించాడు. కానీ సోహైల్, అఖిల్ దాన్ని తిరిగి తెచ్చేసుకున్నారు. ఈరోజు నీరసంగా సాగిన ఈ టాస్క్ రేపైనా జోష్‌గా ఉంటుందేమో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్: మోనాల్ కోసం మెహబూబ్ బలవుతాడా?)
Comments
Please login to add a commentAdd a comment