TASK
-
ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదారత.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!
అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్ అలియన్స్) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు. ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం) -
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్‌కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్‌లో భాగంగా గౌతమ్ టీం బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్‌తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్‌ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్‌బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్‌గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్‌లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్‌లో మాటల యుద్ధం!
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో వారం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలెట్టేశాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. దీని కోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. (ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ) మొదట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్ బాస్.. దాని ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదట జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో.. అవతలి టీమ్‌లోని ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అందరూ చర్చించుకుని పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తొలగించారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్‌తో ఎపిసోడ్ మొదలైంది. అమర్దీప్, కెప్టెన్ గౌతమ్ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్‌ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్ విన్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్‌గా ఏ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!) -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్‌బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్‌బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్‌బాస్ మారథాన్‌లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్‌బాస్ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్‌లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్‌ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్‌కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్‌లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
నైపుణ్యంతోనే అవకాశాల్లో ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఉపాధికల్పన అత్యంత సవాల్‌గా మారుతోందని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత నిరంతరం నైపుణ్యసాధనపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని టీ హబ్ ఆవరణలో పరస్పర అవగాహన ఒప్పందాల మార్పిడి, కాలేజీ యాజమాన్యాలతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా ‘భాగస్వామ్యాల ద్వారా ఉపాధి కల్పన పెంపు’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ ప్రసంగించారు. టాస్క్, దాని భాగస్వాములు అందిస్తున్న నైపుణ్య శిక్షణను ఉపయోగించుకుని తెలంగాణ యువత ఉపాధి పొందాలని సూచించారు. రాష్ట్రంలో వెల్లువలా వస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌లో 780 కాలేజీలు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు టాస్క్ ద్వారా 6.53 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు మరో 14,338 బోధకులను కూడా తయారు చేశామన్నారు. ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు టాస్క్ కార్యకలాపాలు విస్తరించామని, త్వరలో మరికొన్ని పట్టణాల్లో కూడా టాస్క్ కార్యకలాపాలు చేపట్టనున్నామని చెప్పారు. కాగా, బుధవారం నైపుణ్యశిక్షణకు సంబంధించి టాస్క్‌తో 26 సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. వీటిలో ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్, ‘కూ’ఇండియా, మెంటార్ టు గెదర్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. టాస్క్ సంస్థ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ సంస్థ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు వీలుగా యువతలో సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. 27 సంస్థలు టాస్క్‌తో గతంలో కుదుర్చుకున్న ఎంవోయూలను రెన్యువల్ చేసుకున్నాయి. గూగుల్ కెరియర్ సర్టిఫికేషన్ స్కాలర్షిప్లను కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ‘కూ’ డెవలప్మెంట్ సెంటర్ తొలి దేశీ చాటింగ్ అప్లికేషన్ అయిన ’కూ’ కొత్త డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ’కూ’ సంస్థల మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. పలు భారతీయ భాషల్లో చాటింగ్‌కు వీలు కల్పించే ఈ సోషల్ మీడియా వేదికతో కలసి ప్రభుత్వం తెలుగుభాష వాడకాన్ని ప్రోత్సహించనుంది. ’కూ’ లాంటి సంస్థలతో కలిసి ప్రభుత్వ సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయొచ్చని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. డిజిటల్ మాధ్యమాల్లో స్థానిక భాషలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలన్న భావనకు ‘కూ’కట్టుబడి ఉందని, హైదరాబాద్‌లో ఏర్పడే డెవలప్మెంట్ సెంటర్ ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ’కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ అన్నారు. -
రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోలు మనుషులకు మద్దతు మాత్రమే ఇస్తాయని, మనుషుల స్థానాన్ని భర్తీ చేయవని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈఓ శ్రీకాంత్ సిన్హా తెలిపారు. రోబోలను తయారు చేయ డానికి, వాటి సేవలను విస్తృతపరచడానికి నగరంలోని టి–హబ్ వేదికగా అతిపెద్ద రోబోటిక్స్ ఆర్ అండ్ డి ఎకో సిస్టమ్‌తో హెచ్–ల్యాబ్‌ను హెచ్–బోట్స్ ఆవిష్క రించింది. గురువారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరైన టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ డాక్టర్ శాంత థౌతం లు మాట్లాడుతూ.. జనాభాలో 15 శాతం మంది వికలాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడపడానికి సహాయపడే రోబోలను తప్పనిసరిగా తయారు చేయాలని హెచ్–బోట్స్‌ను కోరారు. కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి రాష్ట్ర ఇన్నో వేషన్ సెల్ విశేషంగా కృషి చేస్తోందని డాక్టర్ శాంత థౌతం తెలిపారు. హెచ్–ల్యాబ్‌లతో రోబోటిక్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను తీసుకురానున్నామని ఫౌండర్ కిషన్ పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ : ఇది రా మజా అంటే.. సోహైల్
బిగ్‌బాస్ పదకొండోవారంలో టాస్క్‌ల కంటే కుటుంబ సభ్యుల సందడే ఎక్కువగా ఉంది. గత రెండు ఎపిసోడ్లు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసువచ్చి ఏడిపించడంతోనే గడిచిపోయాయి. ఇక నేటి ఎపిసోడ్‌తో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీకి ఎండ్‌కార్డు పడనుంది. ఈ రోజు ఎపిసోడ్లో లాస్య భర్త, కొడుకు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదకొడో వారంలో అసలు టాస్క్ మొదలు కానుంది. అదే కెప్టెన్సీ టాస్క్. దీనికి హారిక, అభిజిత్, అఖిల్ పోటీ పడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్ అవుతారు. దీంట్లో భాగంగా అభిజిత్‌ను అవినాష్, అఖిల్‌ను సోహైల్, హారికను మోనాల్ తమ తమ భుజాలపై ఎత్తుకున్నారు. అయితే అభి బరువును మోయలేక అవినాష్ తటపటాయించి నట్లు తెలుస్తోంది. ఇక సోహైల్ అయితే ఇదిరా మజా అంటూ.. అఖిల్‌ను తన భూజాలపై ఎక్కించుకున్నాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి, కెప్టెన్ అయిందెవరో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ : నవ్వడం నిషేధం.. గెలిచేదెవరు?
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. కానీ ఈ పెద్దన్న(బిగ్‌బాస్) మాత్రం నవ్వడమే నిషేధం అంటున్నాడు. ఇంటి సభ్యులు ఎవరూ నవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ రోజు ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ నవ్వడం నిషేధం. అంటే ఇంటి సభ్యులు ఒక్కరినొక్కరు నవ్వించుకోవాలి కానీ ఎవరూ నవ్వకూడదు. ఎవరైతే నవ్వుతారో వాళ్లు ఈ టాస్క్ ఓడిపోయినట్లు లెక్క. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను నవ్వించడానికి లాస్క నానా కష్టాలు పడినట్లు తెలుస్తోంది. హారిక దగ్గరికి వెళ్లి ఎన్ని కుప్పిగంతులు వేసినా.. ఆమె నవ్వలేదు. దీంతో సోహైల్ దగ్గరకి వెళ్లి.. చిరునవ్వులు చిందిస్తూ అతన్ని నవ్వించే ప్రయత్నం చేసి విఫలమైంది. ఇక అరియానా మెహబూబ్, సోహైల్‌లను నవ్వించే ప్రయత్నం చేసి ఓడిపోయినట్లు తెలుస్తోంది. సోహైల్ ఇచ్చిన పంచ్‌కు అరియానా తెల్లముఖం వేసుకొని వెళ్లింది. ‘మనం ఫస్ట్‌టైం కలిసినప్పుటు నీకు ఇలా ఇలా హాయ్ చెప్పా’ అని అరియానా అంటే.. ‘అయితే ఏంటి ఇప్పుడు’ అని సోహైల్ పంచ్ విసరడంతో అరియానా ఇక నవ్వించలేను బాబూ... అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక కమెడియన్ అవినాష్ మాత్రం ఈ టాస్క్‌లో సక్సెస్ అయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. అవినాష్ వేసిన పంచ్, చేసిన చేష్టలకు సోహైల్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇదేంటి బిగ్‌బాస్ అంటూ.. గట్టిగా నవ్వేశాడు. ఇక సిక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ మాత్రం ఇంటి సభ్యుల చేష్టలు చూసి ఘొల్లున నవ్వేశాడు. మరి ఈ ‘నవ్వు నిషేదం’ టాస్క్‌లో ఎవరెవరు గెలిచారో తెలుసుకోవాలంటే.. ఈ నాటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్ బాస్: అతిథుల టార్చర్.. కుప్పకూలిన అభి
బిగ్ బాస్ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్ పెట్టి ఆడతారు. దెబ్బలు తగిలినా పట్టించుకోరు. ఒకనొక దశలో కంటెస్టెంట్స్ టాస్క్ భరించలేక కుప్పకూలిపోతుంటారు. బిగ్ బాస్‌లో ఇలాంటి కామన్. అయితే బిగ్ బాస్ 4లో టాస్క్‌ల డోస్ కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది.బిగ్‌బాస్ ఇచ్చిన హోటల్ టాస్క్ కాస్త ఫిజికల్ టాస్క్‌లా మారినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే నేటి ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హోటల్ టాస్క్‌లో భాగంగా అతిథులను మెప్పించే క్రమంలో హోటల్ సిబ్బందిగా ఉన్న అమ్మ రాజశేఖర్, అభిజిత్, అఖిల్ సొమ్మసిల్లిపడిపోయినట్లు తెలుస్తోంది. అతిథులను మెప్పించేందుకు అమ్మ రాజశేఖర్ స్వీమ్మింగ్పూల్ మునిగి పైకి లేస్తూ కిందపడిపోయాడు. స్విమ్మింగ్ పూల్‌లో దూకి తనను మెప్పించాలని రాజకుమారి అరియానా ఆదేశించడంతో.. మాస్టర్ అలా వంద సార్లు అయినా ఓకే అంటూ నీళ్లలో దూకి లేస్తూ కుప్పకూలిపోయాడు. అతిథులను మెప్పించేందుకు అభిజిత్, అఖిల్ కూడా గట్టిగానే కష్టపడినట్లు తెలుస్తోంది. అఖిల్‌ని పుష్ అప్స్ చేయమని అడగ్గా.. కష్టపడుతూ 75పైగా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతను బాగా అలసిపోయినట్లు అర్థమవుతోంది. అలాగే అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ కూడా కాస్త కఠినంగా జరిగింది. ఏకంగా 50పైగా లిఫ్టింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.ఈ టాస్క్ లను చూసిన కొందరు కంటెస్టెంట్స్‌తో పాటు నెటిజన్లు గుండెల్ని పట్టుకున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా భయంగా ఉంది లాస్య అంటూ సుజాత చెప్పిన విధానం చూస్తుంటే హౌజ్ లో వాతావరణం ఎలా ఉందో అర్ధమవుతోంది. స్టార్స్ కోసం హోటల్ సిబ్బందిని గెస్ట్ లు ఈ రేంజ్ లో టార్చర్ చేయడం నిజంగా దారుణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తనాకి నేటి ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు జరిగినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. Hotel task edo physical task laaga avtunde!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/WsgDIKsd96 — starmaa (@StarMaa) October 7, 2020 -
బిగ్‌బాస్: కాసుల వేటలో గెలుపెవరిది!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో టాస్క్‌ల డోస్ పెరుగుతోంది. ముందు తేలికపాటి ఆటలను ఇంటి సభ్యులకు పరిచయం చేసిన బిగ్ బాస్.. పోనుపోనూ మరింత కఠినతరం చేస్తున్నాడు. ఇక హౌజ్‌లో గురువారం సైతం కిల్లర్ కాయిన్స్ టాస్క్ కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్లో మోహబూబ్, సొహైల్ అందరికంటే ఎక్కవ కాయిన్స్ సంపాధించి మొదటి రెండు స్థానంలో ఉండగా.. కిల్లర్ కాయిన్స్ గేమ్ మొదటి లెవల్ ముగిసి రెండో లెవల్ జరుగుతోంది. ఈ గేమ్‌లో ఇంటిసభ్యులందరికి వెల్ ప్రో జాకెట్లను బిగ్‌బాస్ అందించగా కిల్లర్ కాయిన్‌ను ఇంట్లోని ఎవరైనా ఒకరి షర్ట్‌కు అతికించాలి. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఆ కాయిన్ ఉంటే వారి దగ్గర ఉన్న కాయిన్స్‌లో సగం కాయిన్స్ వేరే వారికి ఇచ్చేయాలి. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నలుగురు సభ్యుల మధ్య కాసుల వేట సాగుతోంది. (స్వాతి విషయంలో అభిజిత్‌ను నిలదీసిన హారిక) ఈ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ మాస్టర్, కుమార్‌సాయి, సుజాత, అలేఖ్య హారిక తమ సత్తాను నిరూపించుకునేందుకు పోటీపడనున్నారు. వీరంతా మట్టితో ఉన్న దాంట్లోకి దిగి ఆ బురద నుంచి కాసులను వెతికి తమ బాస్కెట్స్లో వేయాలి. సమయం ముగిసే సరికి ఎవరి దగ్గర ఎక్కు కావయిన్స్ ఉంటే వారు ఈ వారం కెప్టెన్సీ అయినట్లు. ఈ క్రమంలో నలుగురు సభ్యులు తమ ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని పోటీ బరిలో దిగారు. ఎక్కువ సంఖ్యలో కాసలను సొంతం చేసుకోవడానికి ఇంటి సభ్యులు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఇంటి కెప్టెన్ అయ్యిందేకు రెడీ అయ్యారు. మరి ఈ ఆటలో గెలిచి నాలుగో ఇంటి కెప్టెన్ స్థానాన్ని ఎవరూ అధిష్టించారో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో చూడాల్సిందే. (కథ వేరే ఉంటది: మాస్టర్‌కు సోహైల్ వార్నింగ్) Captaincy aatalo coins veta!!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/IOJYYkQsVB — starmaa (@StarMaa) October 1, 2020 -
వైరల్ వీడియో: భార్యను ఎత్తలేక ఎత్తేశాడు
మ్యూజికల్ చైర్ కాంపిటేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాఠశాల రోజుల్లో ఈ ఆట ఆడని వారెవ్వరూ అండరూ. అయితే ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనకు ఓ పెళ్లి వేడుక వేదికైంది. గేమ్ ఎంటంటే.. కుర్చీలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా పెట్టి.. భార్యను పైకి ఎత్తి వాటిపై కూర్చోపెట్టాలి. అలా ఒక్కో కూర్చీని పైకి పేరుస్తూ.. ఎత్తును పెంచుకుంటూ పోవాలి. అలా ఎవరు ఎక్కువ కుర్చీలపై (ఎత్తు) భార్యను కూర్చోపెడితే ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు. ఓ పెళ్లి వేడుకలో బంధువులంతా ఈ టాస్క్‌ను నిర్వహించగా.. దీనిలో దాదాపు నాలుగైదు జంటలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన భార్యను 17 కుర్చీలు ఎత్తుగా వేసి వాటిపై కూర్చోపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంత ఎత్తుకు భార్యను ఎత్తలేక ఒక్కసారిగా కింద పడేశాడు. దీంతో అంత ఎత్తునుంచి కిందపడిపోయింది. ఈ ఆటనంతా అక్కడున్నవారు వీడియోలో చిత్రీకరించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చదువుతో పాటు.. ఉద్యోగం
సాక్షి,కరీంనగర్ : తరగతి పాఠాలు మాత్రమే సరిపోదు.. కోర్సులు పూర్తికాగానే కొలువులు కొట్టాలంటే ఇంకా లోతైన పరిజ్ఞానం, ఉద్యోగ సాధనాంశాలైన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు వివిధ నైపుణ్యాలు తోడైతేనే సాధ్యపడుతుంది. కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే వారి అవసరాలకు తగ్గట్టుగా ఉండే విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా చదువుతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు పెద్దపీట వేయడంతో నైపుణ్య శిక్షణ తప్పనిసరవుతుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అందిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని వాణినికేతన్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి 19వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉద్యోగాంశాలపై శిక్షణ, ఓరాకిల్, జావాలపై శిక్షణ అందిస్తున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైపుణ్య సామర్థ్యాలను పెంచడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఉద్యోగాలకు కావాల్సిన కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంటర్వూ స్కిల్స్, వ్యక్తిగత నైపుణ్యాలు, మాట్లాడే భాష, గ్రూప్‌డిస్కషన్, రాతపరీక్ష, సాప్ట్స్కిల్స్తోపాటు వివిధ అంశాలలో శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పరిక్షించి, వారి కావాల్సిన విధంగా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. టాస్క్‌తోపాటు కళాశాల ఆధ్వర్యంలో ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో బందచర్చలు, జామ్‌తోపాటు పలు అంశాలపై పట్టుకల్పించే విధంగా ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నారు. కోర్సులవగానే ఉద్యోగాలు విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, పాఠ్యాంశాలపై లోతైన అవగాహనతోపాటు వివిధ అంశాలపై పట్టుంటేనే భవిష్యత్‌లో ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓరాకిల్, జావాపై వారం రోజుల శిక్షణ జరుగుతుంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు సాధించేలా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాం. – లక్ష్మీదీపిక, వాణినికేతన్ డిగ్రీ,పీజీ కళాశాల కరస్పాండెంట్ కొత్త విషయాలు తెలిశాయి తరగతి గదుల్లో చదివే పాఠ్యాంశాలతోపాటు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలుంటేనే తొందరగా జాబ్‌లు సాధించవచ్చు. టాస్క్ ఆధ్వర్యంలో మాకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్, జావా, ఓరాకిల్‌లో లోతుగా విశ్లేషణ చేసి చెప్పడంతో వీటిపై పట్టు సాధించవచ్చు. ఇదే కాకుండా కొలువులకు కావాల్సిన అన్ని రకాల నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నారు. – ఏ.శ్రీనిధి, డిగ్రీ విద్యార్థిని -
దక్షిణ కొరియాలో ఘనంగా ఉగాది సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో సుంగ్క్యున్ క్వాన్ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కొరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ జరిగిన ఉగాది వేడుకలకు 100మందికి పైగా హాజరు అయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అతిథులకు ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్‌లు, పిల్లల ఫ్యాషన్ షో కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా. సుశ్రుత కొప్పుల, డా.వేణు నూలు, డా.అనిల్ కావాలా, తరుణ్, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. -
మంధర పర్వతమంత పాత్ర
మనకెవరైనా దుర్బోధలు చేయాలని చూస్తే, వారిని మంధరతో పోలుస్తాం. ఎందుకంటే దుర్బోధ చేయడానికి రామాయణంలో మంధర పాత్ర పెట్టింది పేరు. అయితే, ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి, రామాయణంలో మంధర పాత్రను ప్రవేశపెట్టాడు. వాల్మీకి శ్రీ రామావతార లక్ష్యమే రావణ వధ. రావణ వధ జరగాలంటే సీతను రావణుడు అపహరించాలి. సీతను రావణుడు అపహరించాలంటే, రాముడు అడవులకు వెళ్లాలి. రాముడు అడవులకు వెళ్లాలంటే, ఒక వంక దొరకాలి. ఆ వంకే కైకేయికి దశరథుడిచ్చిన వరం. ఆ వరాలను కైకేయి సరిగ్గా ఉపయోగించుకోవాలంటే అందుకు మంధర బోధ చేయాలి. అదే చేసింది మంధర. తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించి, తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇక్కడ ఆమె కర్తవ్యం ఏమిటి? కైకేయి మనస్సును వికలం చేసి, దశరథుని ఒప్పించి భరతునికి పట్టాభిషేకం చేయించడం, శ్రీరామునికి పద్నాలుగేళ్లు అరణ్యవాసం విధించడం. నిజానికి ఇందులో మంధర స్వార్థం ఏమయినా ఉందా? దుర్బోధ చేసింది కానీ, దానివల్ల తనకేదో లబ్ధి పొందాలన్న తాపత్రయం కనపడిందా అసలు? స్వభావసిద్ధంగా మిక్కిలి చాకచక్యంగా మాట్లాడగల శక్తి ఆమెది. భరతుని పట్టాభిషేకం కోరి కైకతో అయోధ్యకు రాలేదు. కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ, ఆమెకు అవసరం వచ్చినప్పుడు సలహాలనిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. రామునికి పద్నాలుగేళ్లపాటు అవరణ్యవాసానికి పంపడం మంధర మనోవాంఛితం ఏమీ కాదు. తలచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు. కానీ, అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే, త్రేతాయుగంలో ఆస్తికి హక్కుకాలం పద్నాలుగు సంవత్సరాలు, ద్వాపరయుగంలో పదమూడు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలూ అని చెబుతారు. అంటే నియమిత కాలం పాటు అస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే, ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారన్నమాట. బహుశ ఈ కారణం చేతనే మంధర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇలా మంధర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి, రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదోడైంది. అందువల్ల అమె పాత్ర చిత్రణమంతా దైవఘటన. ఆమె మాట దైవ ప్రేరణ. ఏది ఏమైనా, మంధర దుర్బోధ కైకేయిని అపమార్గం పట్టించిన మాట వాస్తవం. దానివల్ల లోకకల్యాణం జరిగినప్పటికీ కైక మీద నింద పడింది. విపరీత పరిణామాలెన్నో సంభవించాయి. అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే, దుష్టసాంగత్యం వల్ల దుర్మార్గమైన పరిణామాలు సంభవించి, జీవితం అపఖ్యాతి పాలవుతుంది. ఆ తర్వాత అస్తవ్యస్తం అవుతుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
తెలంగాణ 'టాస్క్' సూపర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్ : టాస్క్.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్.. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ సంస్థ అంచనాలకు మించి ఫలితాలు సాధిస్తోంది! ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులతోపాటు నిరుద్యోగులకు 85 రకాల కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక్కడి ‘ఫినిషింగ్ స్కూల్’ కోర్సులో శిక్షణ పొందిన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 60 శాతానికి పైగా ఉద్యోగాలు పొందారు. ఇతర కోర్సుల్లో శిక్షణ పొందిన వారిలో సైతం 30 శాతానికి పైగా ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోగలిగారు. విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య వారధిగా.. రాష్ట్రంలో 248 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా 80 వేల నుంచి లక్ష మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసుకొని బయటకు వస్తున్నారు. అయితే వారిలో 29 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. పారిశ్రామిక రంగ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం లేక 71 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు గణనీయ అభివృద్ధి సాధిస్తూ ఏటా వేలాది సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నా.. ఇంజనీరింగ్ పట్టభద్రులు వాటిని అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికరంగ అవసరాలకు తగ్గట్టుగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇది వారధిగా పనిచేస్తోంది. ఇటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అటు పరిశ్రమలకు నైపుణ్యం గల మానవ వనరులను అందించడంలో సఫలీకృతమవుతోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ నైపుణ్యాభివృద్ధి సంస్థగా పేరు తెచ్చుకోవడంతో పాటు పలు పురస్కారాలను కూడా అందుకుంది. నిపుణులు, అనుభవజ్ఞులతో శిక్షణ సంప్రదాయ తరగతి గది శిక్షణ తరహాలో కాకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు టాస్క్ మూడంచెలుగా కోర్సు కాలాన్ని విభజించి శిక్షణ అందిస్తోంది. వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కోసం పర్సనల్ ఇంపాక్ట్ స్కిల్స్, టీం వర్క్‌కు కావాల్సిన నైపుణ్యాల కోసం ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్ అనే పేరుతో కోర్సు కాలాన్ని మూడు భాగాలుగా విభజించి ఆయా రంగాల్లో నిపుణులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తోంది. పారిశ్రామిక సంస్థల్లో ఉన్నత స్థాయిలో పని చేసి పదవీ విరమణ పొందిన అనుభజ్ఞులైన నిపుణులతో కూడా శిక్షణ ఇప్పిస్తోంది. పరిశ్రమల అవసరాలకు కావాల్సిన స్కిల్స్‌ను నేర్పించడంలో ఈ విధానం విజయవంతమైందని టాస్క్ అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక దిగ్గజాలతో ఒప్పందం యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రపంచస్థాయి పారిశ్రామిక దిగ్గజాలతో టాస్క్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్, ఐబీఎం, శామ్సంగ్, ఆటోడెస్క్ వంటి దాదాపు 22 సంస్థలు యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు టాస్క్ భాగస్వాములుగా పని చేస్తున్నాయి. తమ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తమ సంస్థల్లోనే ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. టాస్క్ వద్ద నమోదైన ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్‌లోనే సంబంధిత కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ కల్పిస్తున్నారు. ఫినిషింగ్ స్కూల్ సక్సెస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన నైపుణ్యం లేక ఉద్యోగావకాశాలు అందుకోలేకపోతున్న యువత కోసం టాస్క్ నిర్వహిస్తున్న ఫినిషింగ్ స్కూల్ కోర్సు మంచి సక్సెస్ రేటు సాధించింది. 10–12 వారాల పాటు నిర్వహించే ఈ కోర్సులో 1,645 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వగా వారిలో 976 మంది ఉద్యోగాలు అందుకోగలిగారు. ఈ శిక్షణ పొందిన వారిలో ఇప్పటి వరకు 60 శాతం మంది ఉద్యోగాలు పొందగలిగారని, మిగిలిన వారికి సైతం ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని టాస్క్ వర్గాలు తెలిపాయి. ఫీజులు తక్కువే ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం టాస్క్ దాదాపు 85 రకాల టెక్నికల్, సాఫ్ట్‌స్కిల్ కోర్సులను నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకరోజు నుంచి 4 నెలల వ్యవధితో 45 రకాల కోర్సులను నిర్వహిస్తోంది. డిగ్రీ విద్యార్థులకు ఒకరోజు నుంచి 6 నెలల వ్యవధి గల 17 కోర్సులు, ఫార్మసీ విద్యార్థులకు 1–2 రోజుల వ్యవధితో 6 రకాల కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు 2 రోజుల నుంచి 200 గంటల వ్యవధి గల 7 కోర్సులు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఒకరోజు నుంచి 5 రోజుల వ్యవధి గల 9 రకాల కోర్సులను అందిస్తోంది. ప్రైవేటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లతో పోలిస్తే టాస్క్ అందిస్తున్న కోర్సుల ఫీజు చాలా తక్కువ. ప్రైవేటు కోచింగ్ సంస్థలు శాప్ సాఫ్ట్వేర్ కోర్సు శిక్షణ కోసం రూ.3.5 లక్షల ఫీజు వసూలు చేస్తుండగా.. టాస్క్ కేవలం రూ.12 వేలకే అందిస్తోంది. ఉద్యోగాల కొరత లేదు: సుజీవ్ నాయర్, టాస్క్ సీఈవో ఉద్యోగావకాశాలకు కొరత లేదు. ఉద్యోగాలు లేవని ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. నైపుణ్యాల కొరత ఉంది. నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయి. -
రాష్ట్రంలో శాంసంగ్ అకాడమీ
టైజెన్ ఓఎస్ ఆధారిత యాప్స్, సేవల రూపకల్పనపై శిక్షణ టాస్క్, శాంసంగ్ సంయుక్తంగా నిర్వహిస్తాయన్న కేటీఆర్ సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా, జపాన్, తైవాన్లలో పర్యటించనున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రఖ్యాత శాంసంగ్ సంస్థ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్), శాంసంగ్ సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అకాడమీ కొనసాగుతుందన్నారు. అందులో శాంసంగ్ ‘టైజెన్’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత యాప్స్, ఎలక్ట్రానిక్ సేవల రూపకల్పనపై శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే శిక్షణ పొందిన విద్యార్థులు తయారు చేసిన యాప్స్‌లో మూడింటిని అత్యుత్తమమైనవిగా శాంసంగ్ ప్రతినిధులు ఎంపిక చేయగా... వాటిని రూపొందించిన వారికి సోమవారం టాస్క్ కార్యాలయంలో కేటీఆర్ బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడారు. నిరుద్యోగ యువతకు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగార్హత కల్పించేందుకు ‘టాస్క్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో 40వేల మందికి ‘టాస్క్’ శిక్షణ ఇచ్చిందని.. త్వరలోనే మిగతా జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని టాస్క్ వివిధ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని శాంసంగ్ సంస్థ ప్రతినిధి దీపక్ పేర్కొన్నారు. టాస్క్, టీ-హబ్‌లతో శాంసంగ్ ఒప్పందాల ద్వారా మరింత నైపుణ్యం బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. టైజెన్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు రూపొందించిన హౌస్ హంట్, సేవ్ ఎన్విరాన్మెంట్, గర్లిష్, టూఫూడీ, హెల్తీవేస్, జాబ్స్‌హబ్, యమ్మీ ఫుడ్స్, ఆల్ ఖురాన్, భగవద్గీత, కెరీర్ మేట ర్ యాప్‌లకు మంచి స్పందన వచ్చిందన్నారు. సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా పర్యటన రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా, జ పాన్, తైవాన్ దేశాల్లో పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్న టీ-హబ్ రెండోదశను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలను టాస్క్, టీ-హబ్‌లలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్, టీ-హబ్ సీఈవో శ్రీని కొల్లిపర, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, డెరైక్టర్ కె.దిలీప్ తదితరులున్నారు. -
ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ
హైదరాబాద్: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూఢీల్లి, తెలంగాణా స్టేట్ స్కిల్ అండ్ స్కిల్ నాలేడ్జ్(టాస్క్) సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్హత కనీసం 8వ తరగతి ఉండాలి. డిప్లొమా ఇన్ డిగ్రీలో ఆసక్తి గలవారు తమ సరిఫికెట్స్తో కార్ఖనా బస్‌స్టాప్ సమీపనా ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9618066663 సంప్రదించవచ్చు. అంతే కాకుండా , టోలిచౌకి సమీపాన ఉన్నవారు మైహోం రెయిన్బో అపార్ట్మెంట్స్లోని కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకొనే సౌకర్యం ఉంది.