బిగ్‌బాస్‌ : నవ్వడం నిషేధం.. గెలిచేదెవరు? | Bigg Boss 4 Telugu : Who Will Win In Nevada Nishedam Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : నవ్వడం నిషేధం.. గెలిచేదెవరు?

Published Fri, Nov 13 2020 5:12 PM | Last Updated on Fri, Nov 13 2020 8:43 PM

Bigg Boss 4 Telugu : Who Will Win In Nevada Nishedam Task - Sakshi

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. కానీ ఈ పెద్దన్న(బిగ్‌బాస్‌) మాత్రం నవ్వడమే నిషేధం అంటున్నాడు. ఇంటి సభ్యులు ఎవరూ నవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ రోజు ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ నవ్వడం నిషేధం. అంటే ఇంటి సభ్యులు ఒక్కరినొక్కరు నవ్వించుకోవాలి కానీ ఎవరూ నవ్వకూడదు. ఎవరైతే నవ్వుతారో వాళ్లు ఈ టాస్క్‌ ఓడిపోయినట్లు లెక్క. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను నవ్వించడానికి లాస్క నానా కష్టాలు పడినట్లు తెలుస్తోంది. హారిక దగ్గరికి వెళ్లి ఎన్ని కుప్పిగంతులు వేసినా.. ఆమె నవ్వలేదు. దీంతో సోహైల్‌ దగ్గరకి వెళ్లి.. చిరునవ్వులు చిందిస్తూ అతన్ని నవ్వించే ప్రయత్నం చేసి విఫలమైంది.

ఇక అరియానా మెహబూబ్‌, సోహైల్‌లను నవ్వించే ప్రయత్నం చేసి ఓడిపోయినట్లు తెలుస్తోంది. సోహైల్‌ ఇచ్చిన పంచ్‌కు అరియానా తెల్లముఖం వేసుకొని వెళ్లింది. ‘మనం ఫస్ట్‌టైం కలిసినప్పుటు నీకు ఇలా ఇలా హాయ్‌ చెప్పా’ అని అరియానా అంటే.. ‘అయితే ఏంటి ఇప్పుడు’ అని సోహైల్‌ పంచ్‌ విసరడంతో అరియానా ఇక నవ్వించలేను బాబూ... అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.  ఇక కమెడియన్‌ అవినాష్‌ మాత్రం ఈ టాస్క్‌లో సక్సెస్‌ అయినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. అవినాష్ వేసిన పంచ్‌, చేసిన చేష్టలకు సోహైల్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇదేంటి బిగ్‌బాస్‌ అంటూ.. గట్టిగా నవ్వేశాడు. ఇక సిక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్‌ మాత్రం ఇంటి సభ్యుల చేష్టలు చూసి ఘొల్లున నవ్వేశాడు. మరి ఈ ‘నవ్వు నిషేదం’ టాస్క్‌లో ఎవరెవరు గెలిచారో తెలుసుకోవాలంటే.. ఈ నాటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement