బిగ్‌ బాస్‌: అతిథుల టార్చర్‌.. కుప్పకూలిన అభి | Bigg Boss 4 Telugu : Hotel Task Turns To Physical Task | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌: హోటల్‌ టాస్క్‌లో ఊహించని పరిణామాలు

Oct 7 2020 4:04 PM | Updated on Oct 7 2020 6:05 PM

Bigg Boss 4 Telugu : Hotel Task Turns To Physical Task - Sakshi

హోటల్‌ టాస్క్‌లో భాగంగా అతిథులను మెప్పించే క్రమంలో హోటల్‌ సిబ్బందిగా ఉన్న అమ్మ రాజశేఖర్‌, అభిజిత్‌, అఖిల్‌ సొమ్మసిల్లిపడిపోయినట్లు తెలుస్తోంది

బిగ్‌ బాస్‌ షోలో కొన్ని టాస్క్‌లు కాస్త కఠినంగా ఉంటాయి. కంటెస్టెంట్స్‌ వాటిని చాలెంజ్‌గా తీసుకొని వందశాతం ఎఫెర్ట్స్‌ పెట్టి ఆడతారు. దెబ్బలు తగిలినా పట్టించుకోరు. ఒకనొక దశలో కంటెస్టెంట్స్‌ టాస్క్‌ భరించలేక కుప్పకూలిపోతుంటారు. బిగ్‌ బాస్‌లో ఇలాంటి కామన్‌. అయితే బిగ్‌ బాస్‌ 4లో టాస్క్‌ల డోస్‌ కొంచెం పెరిగినట్లు కనిపిస్తోంది.బిగ్‌బాస్‌ ఇచ్చిన హోటల్‌ టాస్క్‌ కాస్త ఫిజికల్‌ టాస్క్‌లా మారినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే నేటి ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హోటల్‌ టాస్క్‌లో భాగంగా అతిథులను మెప్పించే క్రమంలో హోటల్‌ సిబ్బందిగా ఉన్న అమ్మ రాజశేఖర్‌, అభిజిత్‌, అఖిల్‌ సొమ్మసిల్లిపడిపోయినట్లు తెలుస్తోంది. అతిథులను మెప్పించేందుకు అమ్మ రాజశేఖర్‌ స్వీమ్మింగ్‌పూల్‌ మునిగి పైకి లేస్తూ కిందపడిపోయాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి తనను మెప్పించాలని రాజకుమారి అరియానా ఆదేశించడంతో.. మాస్టర్‌  అలా వంద సార్లు అయినా ఓకే అంటూ నీళ్లలో దూకి లేస్తూ కుప్పకూలిపోయాడు.

అతిథులను మెప్పించేందుకు అభిజిత్‌, అఖిల్‌ కూడా గట్టిగానే కష్టపడినట్లు తెలుస్తోంది. అఖిల్‌ని పుష్‌ అప్స్‌ చేయమని అడగ్గా.. కష్టపడుతూ 75పైగా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతను బాగా అలసిపోయినట్లు అర్థమవుతోంది. అలాగే అభిజిత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ టాస్క్‌ కూడా కాస్త కఠినంగా జరిగింది. ఏకంగా 50పైగా లిఫ్టింగ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు.ఈ టాస్క్ లను చూసిన కొందరు కంటెస్టెంట్స్‌తో పాటు నెటిజన్లు గుండెల్ని పట్టుకున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా భయంగా ఉంది లాస్య అంటూ సుజాత చెప్పిన విధానం చూస్తుంటే హౌజ్ లో వాతావరణం ఎలా ఉందో అర్ధమవుతోంది. స్టార్స్ కోసం హోటల్ సిబ్బందిని గెస్ట్ లు ఈ రేంజ్ లో టార్చర్ చేయడం నిజంగా దారుణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తనాకి నేటి ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు జరిగినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement