పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్‌దీప్‌ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

Bigg Boss: నేను ఉన్నంతవరకు కెప్టెన్ అవ్వనివ్వను: ప్రశాంత్‌కు అమర్‌ సవాల్!

Published Fri, Oct 27 2023 5:19 PM

Contestants Intense Discussion About Hot Chilli Task In House For Captain - Sakshi

ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్‌బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్‌బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్‌ చివరిదశకు చేరింది.  బిగ్‌బాస్‌ మారథాన్‌లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు సూచించాడు.

(ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!)

కాగా.. ఈ వారం బిగ్‌బాస్‌ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్‌, సందీప్‌, గౌతమ్‌, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్‌ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్‌ అయినందుకు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా అమర్‌దీప్‌ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. 

కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్‌ ఎలిమిషన్‌ కోసం మొదట అమర్‌దీప్‌ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్‌దీప్‌ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్‌ నీవు ఇప్పటికే కెప్టెన్ అ‍య్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్‌లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్‌ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. 

(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్‌కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్‌లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్‌దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్‌ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది.  మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

Advertisement
 
Advertisement
 
Advertisement