
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్‌లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.

సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యం
ఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.
మే 9న రిలీజ్
మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్‌లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి