సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న షేక్‌పేట మాజీ తహసీల్దార్ సి.హెచ్. సుజాత (46) శనివారం గుండెపోటుతో మృతిచెందారు. 45 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె నిమ్స్‌లో చేరగా డెంగ్యూతోపాటు కేన్సర్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స తీసుకొని ఇటీవలే ఆమె డిశ్చార్జి అయ్యా రు. అయితే ఈ నెల 2న ఆరోగ్యం విషమించడంతో బంధువులు ఆమెను మళ్లీ నిమ్స్‌కు తరలించారు.
శనివారం ఉదయం చికిత్స పొందుతున్న క్రమంలో తీవ్ర గుండెపోటు రావడంతో మర ణించారు. సుజాత భౌతికకాయాన్ని చిక్కడపల్లి లోని ఆమె నివాసానికి తరలించిన బంధువులు... అనంతరం అంబర్‌పేట శ్మశానవాటికలో అంత్య క్రియలు నిర్వహించారు. ఆమె భౌతికకాయాన్ని సంగారెడ్డి డీఆర్‌వో రాధికారమణి, తహసీల్దార్లు శైలజ, లలిత, జానకి, రామకృష్ణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
రూ. 40 కోట్ల భూమి వ్యవహారంలో...
బంజారాహిల్స్‌లో రూ. 40 కోట్ల విలువజేసే ఓ భూమిని సర్వే చేసి ఆన్‌లైన్‌లో రికార్డులు నమోదు చేసేందుకు రూ. 30 లక్షలు లంచం డిమాండ్ చేసి నట్లు సుజాతపై ఆరోపణలు రావడంతో 2020 జూన్ 7న ఏసీబీ అధికారులు ఆమెతో పాటు ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను, నాటి బంజారాహిల్స్ ఎస్సైని అరెస్టు చేశారు. అలాగే ఆమె నివాసం నుంచి రూ. 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ కోర్టు ఆదేశంతో అప్పట్లో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే సుజాత అరెస్ట్‌తో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ఆమె భర్త అజయ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురై 2020 జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో భర్త అంత్యక్రి యల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా బెయిల్‌పై విడు దలైన సుజాత... ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పొంది సరూర్‌నగర్‌లోని తన తల్లి ఇంట్లో కుమా రుడు భరత్‌చంద్రతో కలిసి ఉంటున్నారు. 2005లో తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరిన సుజాత మెదక్, అంబర్‌పేట, ముషీరాబాద్, హిమాయత్‌నగర్ తదితర మండలాల్లో పని చేశారు. తహసీల్దార్ కాకముందు ఆమె కొంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగానూ పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment