
సుజాత (ఫైల్)
కర్ణాటక, బొమ్మనహళ్లి : రోడ్డు ప్రమాదంలో హాకీ క్రీడాకారిణి సుజాత కేరాళి (17) దుర్మరణం చెందిన ఘటన ధార్వాడ తాలూకాలోని మాదనబావి గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. క్రీడాకారిణి సుజాత కేరాళి ఉదయం తండ్రి మల్లికార్జునతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిలో కారు ఢీకొంది. దీంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌లో పరారీలో ఉన్నాడు. గరగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.