రాజకీయాలకు దూరంగా ఉండాలి
రాజకీయాలకు దూరంగా ఉండాలి
Published Sun, Sep 4 2016 11:16 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
అంగన్‌వాడీలకు మంత్రి సుజాత సూచన
రంపచోడవరం : అంగన్‌వాడీ కార్యకర్తలు రాజకీయాలకు దూరంగా ఉండి పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో రాష్ట్రస్థాయి పౌష్టికాహార వారోత్సవాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.800 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. సరుకుల పంపిణీకి సంబంధించి గుడ్డను కూడా ఈపాస్ ద్వారా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం, సరకుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తినే ఆహారం నాణ్యత లేకపోతే ఆనారోగ్యం బారిన పడాతారని తెలిపారు. రక్తహీనత, పోషకాహార లోపంతో ఏజెన్సీలో విద్యార్ధులు మృత్యువాత పడుతున్నారని, వీటిని ఆరికట్టాలని కోరారు. ఎమ్మెల్సీ రత్నాబాయి మాట్లాడుతూ చిరుధాన్యాలు తినాలని చెబుతున్నారు కానీ వాటి లభ్యత ఏజెన్సీలో లేదని జీసీసీ ద్వారా అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, స్పెషల్ కమిషనర్ చక్రవర్తి, జెడ్పీటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచ్ వై.నిరంజనీదేవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement