
దంపతులపై వేట కొడవళ్లతో దాడి
మహబూబ్‌నగర్ : జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి.
కొన ఊపిరితో ఉండటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, సుజాతగా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.