నగరంలోని బాలపీరయ్య కల్యాణమంటపం సమీపంలో ఎన్.వెంకటయ్య(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. మృతుడి స్వస్థలం గూడూరు. కానీ ప్రస్తుతం బుజబుజనెల్లూరు కాలనీలో నివసిస్తున్నాడు.
కల్యాణ మంటపం సమీపంలోనే వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హత్యకు పాత కక్షలే కారణం అయి ఉంటాయని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న 5వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.