కన్న తల్లిని కడతేర్చిన కసాయి | Son murderd in his mother in Nellore district | Sakshi
Sakshi News home page

కన్న తల్లిని కడతేర్చిన కసాయి

Published Fri, May 26 2017 12:30 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

కన్న తల్లిని కడతేర్చిన కసాయి - Sakshi

కన్న తల్లిని కడతేర్చిన కసాయి

► మద్యం మత్తు, ఆస్తి తగాదాలే కారణం
►ఇంటి ఆవరణలోనే గుంత తవ్వి పూడ్చేందుకు యత్నం
►స్థానికుల అనుమానంతో వెలుగుచూసిన హత్యోదంతం


జగదేవిపేట (ఇందుకూరుపేట) : మద్యం మత్తులో ఓ కసాయి కొడుకు కన్న తల్లినే కడతేర్చాడు. ఈ సంఘటన మండలంలోని జగదేవిపేటలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. జగదేవిపేట మజరా వడ్డిపాళెంకు చెందిన బెల్లంకొండ లక్ష్మమ్మ (71), చంద్రయ్య దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పిల్లలందరికి వివాహాలు అయ్యా యి. భర్త చంద్రయ్య కాలం చేయడంతో ఆమె కొడుకు మురళీకృష్ణతో వద్ద ఉంటుంది. మొదటి కుమార్తె కృష్ణమ్మ భర్త మృతి చెందడంతో కొంత కాలంగా ఆమె అత్తారింటి నుంచి తిరిగి వచ్చి జగదేవిపేటలో ఉన్న మరో చెల్లెలు ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

మురళీకృష్ణ మద్యానికి బానిసై తల్లితో పాటు భార్య సంధ్యను నిత్యం తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త పెట్టే బాధలు భరించలేక సంధ్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తమకు ఉన్న 1.20 ఎకరాల పొలాన్ని మురళీకృష్ణ సాగు చేస్తున్నాడు. దీనికి సమీపాన మరి కొంత పొలం అక్క కృష్ణమ్మకు ఉంది. అయితే కృష్ణమ్మ పొలం మనదేనంటూ అందులో కొంత తన పేరు మీద రాయాలంటూ తరుచూ తల్లితో గొడవ పడుతున్నాడు. గత రెండు రోజుల నుంచి పూటుగా మద్యం తాగి తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున వృద్ధురాలైన తల్లి లక్ష్మమ్మతో గొడవపడి బలంగా కొట్టడంతో మృతి చెందింది.

దీంతో తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులకు చెప్పాడు. అయితే ఇంటి ఆవరణలో ఉన్న స్థలంలో తల్లి మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్య తీసేందుకు ఒంటరిగా పూనుకున్నాడు. దీంతో ఇరుగు పొరుగు వారు చూసి గ్రామంలో ఉన్న కుమార్తెలకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జ్‌ ఎస్సై వెంకటేశ్వర్లు  సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement