కోపంతో వెళ్లిన సంతోష్‌ గొడ్డలితో తిరిగొచ్చి.. | Man kills 75-year-old mother | Sakshi
Sakshi News home page

మద్యానికి రూ. 100 ఇవ్వలేదని..!?

Published Sun, Oct 15 2017 6:44 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

Man kills 75-year-old mother - Sakshi

సాక్షి, శివపురి (మధ్యప్రదేశ్‌) : మానవసంబంధాలు రోజురోజుకు మరింతగా దిగజారి పోతున్నాయని చెప్పడానికి మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. మద్యానికి బానిసగా మారిన 35 ఏళ్ల కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని తల్లిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ని శివపురి అనే గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సంతోష్‌ సేన్‌ (35) ఏళ్ల యువకుడు కొన్నాళ్లుగా మద్యానికి బానిసలా మారాడు. 24 గంటలూ మద్యం తాగుతూ గాలి తిరుగుళ్లు తిరిగే అలవాటుంది. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కూడా సంతోష్‌ ఇంటికి వచ్చి.. మద్యం కొనుక్కోవాలి.. రూ. వంద ఇమ్మని తల్లిని అడిగాడు.  అప్పటికే మద్యంలో మత్తులో ఉన్న కొడుకును చూసి.. డబ్బు ఇవ్వనని తల్లి గిరిజాబాయి సేన్‌ తెగేసి చెప్పింది.  కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిన సంతోష్‌ గంట తరువాత.. ఒక పదునైన గొడ్డలితో ఇంటికి వచ్చాడు.

కొడుకు ఆకలితో ఇంటికి వచ్చాడుకున్న ఆ తల్లి.. అన్నం పెట్టేందుకు సిద్ధమైంది. మద్యం మత్తులో ఇదేం పట్టించుకోని సంతోష్‌ తనతో తెచ్చుకుని గొడ్డలితో తల్లితలన తెగనరికి అక్కడనుంచి పారిపోయాడు.
ఇంట్లోంచి రక్తం కారుతున్న వాసన రావడంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి తలపులు బద్దలుకొట్టి చూస్తే రక్తపు మడుగులో గిరిజాబాయి శవం పడి ఉంది. సంతోషే ఈ పని చేసి వుంటాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సంతోష్‌ కోసం వెతుకుతుండగా.. ఒక మద్యం షాపు దగ్గర దొరికాడు. అరెస్ట్‌ చేసి తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా.. వందరూపాయలు ఇవ్వనందుకు హత్య చేశానని సంతోష్‌ అంగీకరించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement