సాక్షి, గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో సుధారాణి దంపతులు పోస్ట్ పెట్టారంటూ నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సుధారాణి దంపతులను పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టగా, సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరైంది.
వైజాగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు బోడి వెంకటేశ్వర్లుకు కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒంగోలు జైలు నుంచి పిటి వారెంట్ ద్వారా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయనుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.
తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారు. పోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చినట్లు ఆమె కోర్టుకు తెలిపారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు తరలించినట్టు ఆమె కోర్టుకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment