ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో భాగమని మోదీ సర్కారుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంతో సుదీర్ఘ పోరుకు సిద్ధమన్నారు. 2 రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు బుధవారం సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ‘దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లాలనుకుంటున్నారు.
ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత ఒకటొకటిగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో దీన్ని అమలుచేస్తారు. కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలన్నీ కలిసిరావాలి’ అని కోరారు. కాగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.