న్యూఢిల్లీ: వివిధ కుంభకోణాల్లో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు ఇతర మంత్రులకు కేజ్రీవాల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ నెల 23వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేస్తామని ఆ పార్టీ ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా తెలి పారు. పార్టీ సహచరుడు జగదీష్ ముఖితో కలసి శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
షీలా ప్రభుత్వం అధికారంలో ఉండగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలను సేకరిం చేందుకు బీజేపీ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించిందని అన్నా రు. ఈ కమిటీకి జాతీయ న్యాయవిభాగం కార్యదర్శి పింకీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారన్నారు. షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆదేశించాలని ఎల్‌జీని కోరతామన్నారు. అధికారంలోకి రాగానే అవి నీతిని అంతం చేయడమే తమ లక్ష్యమంటూ శాసనసభ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచారం సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గాలికి వదిలేసిందన్నారు. కామన్‌వెల్త్ క్రీడాకుంభకోణంపై ప్రధానంగా తాము దృష్టి సారిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందన్నారు. ఆ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు అనేకమంది అధికారుల ప్రమేయం ఉందన్నారు.
అవినీతి కాంగ్రెస్ నేతలకు ఆప్ సర్కారు అండ
Published Fri, Jan 17 2014 11:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement