Vijendra Gupta
-
అసెంబ్లీలో బెంచి ఎక్కిన ఎమ్మెల్యే
ఢిల్లీ అసెంబ్లీలో చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా నిరసన వ్యక్తం చేయడానికి ఏకంగా బెంచి ఎక్కి నిలబడ్డారు. ఢిల్లీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న గుప్తా.. ముందు వరుసలో స్పీకర్‌కు ఎడమవైపు కూర్చుంటారు. తెల్లటి కుర్తా, పైజమా ధరించిన ఆయన.. ఒక్కసారిగా ఉన్నట్టుండి బెంచి మీదకు ఎక్కి నిలబడ్డారు. ట్యాంకర్ల స్కాం గురించి మాట్లాడుతూ, నిరసన వ్యక్తం చేయడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో స్పీకర్ సహా సభ్యులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. కొంతమంది సభ్యులు ఆయన నిలబడటాన్ని సెల్ఫోన్లలో వీడియో తీసుకున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇలా బెంచి మీద నిలబడటం తాను ఎప్పుడూ చూడలేదని, ఇది చాలా సిగ్గుచేటని స్పీకర్ రామ్ నివాస్ అన్నారు. సభాసమయాన్ని మీరు హైజాక్ చేస్తున్నారంటూ గుప్తా మీద మండిపడ్డారు. అయితే గుప్తా మాత్రం ఆయన మాటలు వినిపించుకోకుండా తన నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న మీరు ఇలా చేయడం బాగోలేదని, వెంటనే కూర్చోవాలని స్పీకర్ పదే పదే ఆయనకు విజ్ఞప్తి చేశారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. మిగిలినవాళ్లంతా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులే. గుప్తా నిరసన వ్యక్తం చేసే సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సభలోనే ఉన్నారు. -
ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!
-
ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!
న్యూఢిల్లీ: అధికార ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన అభ్యంతరకరవ్యాఖ్యల వివాదం సోమవారం కూడా ఢిల్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ విషయమై ఆప్ మహిళా ఎమ్మెల్యేలతో బీజేపీ సభ్యుడు విజేందర్ గుప్తా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది సభలో తీవ్ర రచ్చ సృష్టించడంతో ఆయనను మార్షల్ బలవంతంగా ఎత్తుకొని.. బటయకు తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. గతవారం ఓపీ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆప్ ఎమ్మెల్యేలతో విజేందర్ గుప్తా వాగ్వాదానికి దిగడంతో ఆయనను 4 గంటలవరకు అసెంబ్లీ లోపలికి రావొద్దని స్పీకర్ రామ్నివాస్ గోయల్ ఆదేశించారు. దీంతో స్పీకర్ తీరును తప్పుబట్టిన గుప్తా సభ నుంచి బయటకు వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో మార్షల్స్ సభలోకి వచ్చి ఆయనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గుప్తా ఎంతకూ వెనక్కితగ్గకపోవడంతో మార్షల్స్ బలవంతంగా ఎత్తుకొని.. సభ బయటకు తీసుకుపోయారు. -
అవినీతి కాంగ్రెస్ నేతలకు ఆప్ సర్కారు అండ
న్యూఢిల్లీ: వివిధ కుంభకోణాల్లో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు ఇతర మంత్రులకు కేజ్రీవాల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈ నెల 23వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేస్తామని ఆ పార్టీ ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజయేంద్ర గుప్తా తెలి పారు. పార్టీ సహచరుడు జగదీష్ ముఖితో కలసి శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. షీలా ప్రభుత్వం అధికారంలో ఉండగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలను సేకరిం చేందుకు బీజేపీ ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించిందని అన్నా రు. ఈ కమిటీకి జాతీయ న్యాయవిభాగం కార్యదర్శి పింకీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారన్నారు. షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఆదేశించాలని ఎల్జీని కోరతామన్నారు. అధికారంలోకి రాగానే అవి నీతిని అంతం చేయడమే తమ లక్ష్యమంటూ శాసనసభ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచారం సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గాలికి వదిలేసిందన్నారు. కామన్వెల్త్ క్రీడాకుంభకోణంపై ప్రధానంగా తాము దృష్టి సారిస్తామంటూ ఆ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిందన్నారు. ఆ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు అనేకమంది అధికారుల ప్రమేయం ఉందన్నారు. -
షీలాతో బీజపీ మాజీ అధ్యక్షుడు అమీతుమీ!
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తో అమీతుమీ తేల్చుకోవడానికి ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా సిద్ధమయ్యారు. డిసెంబర్ 4 తేదిన జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే షీలా దీక్షిత్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ పోటీ దిగగా, గుప్తా కూడా రంగంలోకి దూకడం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లను అకాళీదళ్ కు కేటాయించగా, 58 స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లున్నాయి.