
లెఫ్టినెంట్ గవర్నర్, క్రేజీవాల్ మధ్య మరో వివాదం
ఢిల్లీ: క్రేజీవాల్ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య మరో వివాదం రేగింది. గత వారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మరో అడుగు ముందుకేశారు.
ఢిల్లీ పాలనకు సంబంధించిన ఫైళ్ల వివరాలను తనకు పంపించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై క్రేజీవాల్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజా వివాదంతో ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లెఫ్టినెంట్ గవర్నరే ప్రభుత్వాధినేత అని హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై క్రేజీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్న విషయం తెలిసిందే.