న్యూఢిల్లీ : డీడీసీఏ రగడ చివరకు కోర్టు మెట్లు ఎక్కింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.
అలాగే ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాటియాల కోర్టులో అరుణ్ జైట్లీ క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నారు. మరోవైపు డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.10కోట్లకు పరువునష్టం దావా వేసిన జైట్లీ
Published Mon, Dec 21 2015 11:12 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement