civil defamation case
-
నేనేమీ ఆయన పరువు తీయలేదు
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది. ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?') డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
'ఫేస్ బుక్, ట్విట్టర్ లో నాపై ఆరోపణలు'
న్యూఢిల్లీ : ఆప్ నేతలపై పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. జైట్లీ స్టేట్మెంట్ను పాటియలా హౌస్ కోర్టు రికార్డు చేసింది. తనతో పాటు కుటుంబసభ్యులపై కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు ...ట్విట్టర్, ఫేస్ బుక్ లో నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తన స్టేట్మెంట్లో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని జైట్లీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు...అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోతనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో డిసెంబర్ 21న పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఇక డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. -
'జైట్లీ చాలా పెద్ద తప్పుచేశారు'
న్యూఢిల్లీ: ఒకప్పటి బీజేపీ నేత, ప్రముఖ సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. కేజ్రీవాల్ పై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేసి అతిపెద్ద తప్పు చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు మాత్రమే కాదు ఇతర నేతలపై కూడా ఆ దావా వేయడం సరికాదని అన్నారు. ఈవిషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం రూ.పది కోట్లు తనకు చెల్లించాలని కోరుతూ అరుణ్ జైట్లీ ఢిల్లీ సీఎం ఆయన నేతలపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీనిపై రాం జెఠ్మలానీని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేయగా ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. 'ఇది నేను వ్యక్తిగతంగా తీసుకొని వ్యాఖ్యానించడం లేదు. జైట్లీ మాత్రం కేజ్రీవాల్ విషయంలో చెడ్డపనిచేశారు. ఈ సందర్భంగా నేను కేజ్రీవాల్ కు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని జెఠ్మలానీ అన్నారు. -
రూ.10కోట్లకు పరువునష్టం దావా వేసిన జైట్లీ
న్యూఢిల్లీ : డీడీసీఏ రగడ చివరకు కోర్టు మెట్లు ఎక్కింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పాటియాల కోర్టులో అరుణ్ జైట్లీ క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నారు. మరోవైపు డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.