న్యూఢిల్లీ: అత్యాచారానికి పాల్పడిన వారు 15 ఏళ్ల బాలురైనా మరణ శిక్ష విధించాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. మహిళా భద్రతపై సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అత్యాచారం వంటి హేయమైన నేరాలకు పాల్పడిన 15 ఏళ్లు పైబడిన వారికి మరణ శిక్షగాని, జీవిత ఖైదు గాని విధించాలని కేజ్రీవాల్ అన్నారు. గత వారం ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో రెండున్నరేళ్లు, ఐదేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారని, దీనికి సంబంధించి దాదాపు 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.