కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు | Delhi's Patiala House Court summons CM Kejriwal for alleged misrepresentation in election affidavit.Summon for July 30 | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు

Published Tue, Mar 22 2016 7:28 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు - Sakshi

కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్‌ కు  డిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్  లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.  జులై 30లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. 

2013 తన ఎన్నికల  సందర్భంగా కేజ్రీవాల్ తన సరైన చిరునామా ఇవ్వలేదని, ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ మౌలిక్ భారత్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ   పిటిషన్ దాఖలు చేసింది.  దీనిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్ వారియా ఈ సమన్లు జారీ చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ విమర్శించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement