మాజీ ఆర్మీ జవాన్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే రామ్ మనోహర్ లోహియ ఆస్పత్రి వద్ద ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయలేదంటూ మనస్తాపంతో మాజీ ఆర్మీ ఉద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ మంగళవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.