విమానాల్లో... మహిళలకు మాత్రమే!! | Now, Air India to reserve seats for women on domestic flights | Sakshi
Sakshi News home page

విమానాల్లో... మహిళలకు మాత్రమే!!

Published Fri, Jan 13 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

విమానాల్లో... మహిళలకు మాత్రమే!!

విమానాల్లో... మహిళలకు మాత్రమే!!

వినూత్న సేవలకు ఎయిర్‌ ఇండియా శ్రీకారం
న్యూఢిల్లీ: ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’.. ఇలాంటి వాక్యాలు బస్సుల్లో చూస్తుంటాం. ఇపుడీ ట్రెండ్‌ విమానాల్లోనూ ఆరంభమైంది. ఎయిర్‌ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో ఈ నెల 18 నుంచి మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

‘మహిళలు విమానాల్లో ఒంటరిగా ప్రయాణించేటపుడు వారికి కిటికీ పక్కనో, మధ్యలోనో సీటు దొరకవచ్చు. అలాంటప్పుడు వారు వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని సీట్లను రిజర్వు చేస్తున్నాం’ అని ఎయిర్‌ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలిసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్‌ పరిశ్రమలో ఇలాంటి సేవలు ఇదే ప్రథమం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement