
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రతివాదుల లాయర్ అన్నారు. సుప్రీంకోర్టు మాత్రమే విచారించగలదని పేర్కొన్నారు. ఇతదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది..
కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. అలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌కు బాధ్యత ఉంటుంది. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంతో తప్పులేదు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఆధారంగా ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సరికాదు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే సీఎం స్పందించకూడదా?. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని, హెచ్‌ఎం పేర్లు ప్రస్తావించినందుకే కేసును సీబీఐకి అప్పగిస్తారా?. సిట్‌ను క్వాష్ చేస్తే అసలు కేసు ఎక్కడిది అంటూ బలంగా తమ వాదనలు కోర్టుకు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment