
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా..
‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?.
అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?.
ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో..
మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా..
ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి..
మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా?
ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా?
తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్! @TelanganaCMO
— Revanth Reddy (@revanth_anumula) October 5, 2023
మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని
తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?
అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?
ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ…
ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు
Comments
Please login to add a commentAdd a comment