
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మొయినాబాద్ కేసు వివరాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని ధర్మాసనం సీబీఐకి సూచించింది. ఆ తర్వాత సీబీఐ వాదన కూడా వింటామని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
అదేవిధంగా నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణనకు జనవరి 9వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది.
చదవండి: మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment