సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. ఈ కేసులో వాస్తవాలు బయ టకు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలి పా రు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను దాచి పెట్టి, అసత్య ప్రచారంతో బీజేపీని బద్నామ్ చేసే కుట్రకు తెరతీసిందని మండిపడ్డారు.
‘ఫాంహౌస్ కేసులో కర్త, కర్మ, క్రియ.. ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌కు ‘ప్రగతి భవన్’అడ్డాగా మారింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ప్రభు త్వం ఆడుతున్న డ్రామాపై ప్రజల్లో చర్చ జరుగు తోంది’అని అన్నారు. నేరస్తు లను కాపాడ టానికే ‘సిట్’ విచారణ సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో ‘సిట్’ విచారణ జరిపినా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోవడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు.
లిక్కర్, డ్రగ్స్, అవినీతి కేసుల్లో నిండా కూరు కుపోయిన తన కుటుంబాన్ని కాపా డుకు నేందుకు, ప్రజల దృష్టిని మ ళ్లించడానికి కేసీఆర్ అల్లిన కట్టుకథనే ఫాంహౌస్ కేసు అని వ్యాఖ్యానించారు. ఫాంహౌస్‌కేసులో దోషులెవరో గుర్తించడానికే సీబీఐ విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారన్నా రు. సీబీఐ విచారణతో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని బీజేపీ భావిస్తోందన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మొదటి నుంచీ తా ము చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే హైకోర్టును ఆశ్రయించామని మీడియా తో అన్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ దర్యాప్తులో
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment