సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్‌తో కలిసి నీలోఫర్ కేఫ్‌కు వచ్చారు.
సాదాసీదాగా కేఫ్‌లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్’ తిన్నారు. ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు.
కేఫ్‌కు నీలోఫర్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్‌కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment