Bun
-
Bandi Sanjay: మస్కా బన్ తిని.. చాయ్ తాగి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా హిమాయత్ నగర్‌లోని నీలోఫర్ కేఫ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్‌తో కలిసి నీలోఫర్ కేఫ్‌కు వచ్చారు. సాదాసీదాగా కేఫ్‌లోకి వెళ్లి కూర్చుని ‘మస్కాబన్’ తిన్నారు. ఛాయ్ తాగారు. బండి సంజయ్ వచ్చారని తెలుసుకున్న నీలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నారు. తాము ఈ మధ్య చిట్టిముత్యాలతో తయారు చేసిన సాంబార్ రైస్‌ను బాబూరావు అభ్యర్థన మేరకు సంజయ్ రుచిచూసి బాగుందని పేర్కొన్నారు. కేఫ్‌కు నీలోఫర్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించడంతో.. ‘తాను చాలా పేదరికం నుండి వచ్చానని, 1976లో నీలోఫర్ ఆస్పత్రి వద్ద రూ.2 రూపాయలకు చిన్న ఉద్యోగం చేసి.. అక్కడే టీ, బిస్కట్లు అమ్మానని, వాటికి గిరాకీ ఉండటంతో కేఫ్ స్థాపించానని తెలిపారు. అందుకే నీలోఫర్‌కు వచ్చే రోగులకు తనవంతు సహకారం అందిస్తున్నాని తెలపడంతో బండి సంజయ్ బాబూరావును ప్రత్యేకంగా అభినందించారు. -
మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!
కావలసినవి: బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్ – 1 కప్పు చొప్పున పీనట్ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూ¯Œ , బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్, పీనట్స్ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు! -
స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు!
కావలసినవి: చిలగడదుంపలు – 2 (మెత్తగా ఉడికించుకుని, తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి) ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) కొబ్బరి తురుము – అర కప్పు కారం – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్ జీలకర్ర పొడి – అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్ గోధుమ పిండి – 2 కప్పులు పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె, గోరువెచ్చని నీళ్లు – కొద్దికొద్దిగా ఉప్పు – తగినంత నువ్వులు – కొద్దిగా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్ పెట్టుకుని.. 1 టేబుల్ స్పూన్ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, చిలగడదుంపల ముక్కలు, కొబ్బరి తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అప్పడాల్లా ఒత్తి.. అందులో చిలగడదుంపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి.. తిరిగి మళ్లీ బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నువ్వులు అద్ది.. ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఇవి చదవండి: ఈ స్టీమర్ కుకింగ్ ఎలక్ట్రికల్ పాట్.. గురించి విన్నారా..! -
కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా? చినుకు ఎలా ఉంటుందంటే.. సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న చినుకులుగా కింద పడతాయి. నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం.. ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. ఒక్క చినుకూ చూడని ప్రదేశం.. భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట. ప్రతి చుక్కా కిందకు పడదు.. వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు. వర్షానికి వాసన ఉంటుందా? వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు. 14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు.. ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి. వర్షపు నీటిలోనూ విటమిన్.. వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. కనురెప్ప కంటే తక్కువ బరువు.. సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట. -
కేక్‌లతో పాటు.. బ్రెడ్స్, బన్స్.. బేక్ చేయొచ్చు! దీని ధర ఎంతంటే!
అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా.. సెలబ్రేషన్ అనగానే కేక్ ఉండాల్సిందే. ఆ కేక్స్‌ని నచ్చే ఫ్లేవర్స్‌లో హాట్‌హాట్‌గా తయారు చేసిపెడుతుందీ ఎలక్ట్రిక్ కేక్ మేకర్. ఇందులో కేవలం కేక్సే కాదు.. బ్రెడ్స్, బన్స్, కప్‌కేక్స్.. ఇలా చాలా రకాలను బేక్ చేసుకోవచ్చు. దీంట్లో బేక్, గ్రిల్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. లో–గ్లూటెన్ ఫ్రీ కేక్, సుగర్ ఫ్రీ కేక్, ఫ్రూట్ కేక్ వంటివీ బేక్ చేసుకోవడానికి రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. డివైజ్‌కి సరిపడే.. బ్లాక్ కలర్ పాత్ర, దానికి తగ్గ మూత ఉంటాయి. ఆ పాత్ర అడుగున.. గరిటెలాంటి పరికరం బిగించి ఉంటుంది. దాంతో కేక్స్ మాత్రమే కాదు.. ఫ్రైలు, కూరలనూ వండుకోవచ్చు. -ధర 189 డాలర్లు (రూ.14,946) చదవండి: 1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..! ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
ఛాయ్, బన్లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్
Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా. ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు. అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్ 1990కి కాల్ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్ రోషన్ మహానామా తాను ప్రజలకు సర్వ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha. The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI — Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022 (చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’) -
భలే రుచులు.. బనానా రైస్ కేక్, డ్రైఫ్రూట్స్ బన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇంటి వంటలో ఉండే రుచి, ఆరోగ్యం మరి దేనిలోనూ దొరకదు. ఈ కింది స్పెషల్ రెసిపీలతో మీ కుంటుంబానికి కొత్త రుచులను పరిచయం చేయండి. బనానా రైస్ కేక్ కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు – పావు లీటర్ అరటిపండు గుజ్జు – అర కప్పు అన్నం – 2 కప్పులు పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్ బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని చల్లారనివ్వాలి. దానిపైన అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడివేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. డ్రైఫ్రూట్స్ బన్స్ కావలసిన పదార్థాలు మైదా పిండి – 500 గ్రా. ఉప్పు – అర టీ స్పూన్ పంచదార – 3 టేబుల్ స్పూన్లు బటర్ – 100 గ్రా. పాలు – 300 గ్రా. గుడ్డు – 1 ఈస్ట్ – 1 టేబుల్ స్పూన్ (పావు కప్పు వేడినీటిలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి) దాల్చిన చెక్కపొడి – కొద్దిగా నూనె – కొద్దిగా తయారీ విధానం ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదారతో పాటు.. ఈస్ట్ జ్యూస్, 50 గ్రాముల బటర్, గుడ్డు, పాలు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకుని, కొద్దిగా నూనె పూసి, 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అది పొంగుతుంది. అనంతరం మరో పది నిమిషాలు ముద్దను మరింతగా కలిపి.. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో పొడవుగా వెడల్పుగా ఒత్తుకుని దానిపైన మిగిలిన బటర్ రాసి.. 2 టేబుల్ స్పూన్ల పంచదార, దాల్చిన చెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటి జల్లి.. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, బాదం ముక్కలు వంటివన్నీ మొత్తం జల్లి ఓ వైపు నుంచి చుట్టుకోవాలి. తర్వాత గుండ్రంగా కట్ చేసుకుని బేకింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. అనంతరం ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి.. బ్రష్‌తో బన్స్కి ఆ మిశ్రమాన్ని పూసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్ దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్సన్ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్ ఫుడ్ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు కంపెనీ బన్స్ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 2018లోనూ.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్ పార్టనర్స్, గేట్‌వే పార్టనర్స్ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దిగ్గజాలతో పోటీ లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బన్ను పోయి బిస్కట్
బన్ను... ఉదయం చాయ్‌తోపాటు తినటం ప్రజల అలవాటు. దైనందిన జీవనంలో దీనిది విడదీయరాని బంధం. అయితే ఇది 1920కి ముందు ఉన్న పరిస్థితి. అప్పుడే నగరంలో కాలుమోపింది మరో పదార్థం. చూస్తుండగానే బన్ను కనుమరుగై ఆ కొత్త పదార్థం మన ఇరానీ చాయ్‌కి సరిజోడీ అయింది. దానితో పాటు ఆస్వాదిస్తేనే ఇరానీ చాయ్ రుచికి ఓ అర్థం ఉంటుందనేంతగా సగటు హైదరాబాదీని మెప్పించింది. అదే ఉస్మానియా బిస్కట్..! ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం ప్రపంచ పటంలో ప్రత్యేకతను సంతరించుకోవాలని కలలుగన్నాడు. ఆ కలలను సాకారం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని అన్నింటా ముందు నిలిపాడు. విద్యుదీకరణ, రైల్వే, రోడ్డు, విమాన సర్వీసుల అభివృద్ధి, అసెంబ్లీ, జూబ్లీహాలు, హైకోర్టు భవనం, స్టేట్ మ్యూజియం, నేటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియూ యూనివర్సిటీ... ఇలా భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంటూ ప్రగతి దిశగా పరుగులెత్తింది. దీనికితోడు తన అభి‘రుచు’లు పదికాలాల పాటు నిలిచిపోయేలా కూడా చొరవచూపాడు. అలా పుట్టిందే ఉస్మానియూ బిస్కట్. 1920 నాటికి హైదరాబాద్‌లో బన్ను (డబల్రోటీ)దే హవా. అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఇరాన్ చాయ్‌తోపాటు బన్ను తినటం ఉన్నత వర్గం అలవాటు. ఇరానీచాయ్ లేనిదే నిజాంకు కూడా పూటగడవదు. ఓరోజు చాయ్‌తోపాటు ఆయన మైదా పిండితో రూపొందించిన పదార్థం రుచి చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. ఇక నాటి నుంచి చాయ్‌తో పాటు దాన్ని ఆరగించటం ప్రారంభించారు. క్రమంగా అది దివానం దాటి గల్లీలకూ పాకింది. ఆయన నాంది పలికిన అలవాటు కావటంతో ఆ పదార్థానికి ఆయన పేరే దక్కింది. అదే ఉస్మానియూ బిస్కట్..! సిటీలోని కేఫ్‌లో ఓ మూల కూర్చుని చాయ్ తాగుతూ బిస్కట్లను లాగిస్తుంటే సమయం తెలియదు. ఆలోచనలకు పదునుపెడుతుంది, ఉత్సాహాన్ని నింపుతుంది, బద్ధకాన్ని వదిలిస్తుంది, పనిలో వేగాన్ని కలిగిస్తుంది, స్నేహాన్ని పెంచుతుంది... అంటూ యువత కితాబిస్తున్న ఆ కవల జంట కాంబినేషనే... ఇరానీ చాయ్ ఉస్మానియూ బిస్కట్. హైదరాబాద్‌లో పుట్టిన ఈ బిస్కట్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు. ఉస్మానియా బిస్కట్ పేరుతోనే అమెరికా, బ్రిటన్‌లలోనూ అది హల్చల్ చేస్తోంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఎడారి దేశాల్లో దాని హవా చెప్పనే అక్కర్లేదు. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్‌లకు ఏమాత్రం తీసిపోని కీర్తిని ఇది సొంతం చేసుకుంది. బట్టీలో భలేగా సిద్ధం... ఉస్మానియూ బిస్కట్ రుచిలోని మజాయే వేరు. కాసేపు తీయగా, ఆ వెంటనే ఉప్పగా, ఇంతలో కమ్మగా... వెరసి గ‘మ్మత్తు’గా ఉంటుంది. ముందు గట్టిగా అనిపించినా టీలో నంజుకుని నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. గుండ్రగా, మందంగా, వెనకవైపు కాస్త మాడినట్టుగా కనిపించే ఉస్మానియూ బిస్కట్లు బట్టీల్లో సిద్ధమవుతారుు. వీటి తయూరీకి మూల పదార్థం మైదాపిండి. ఇందులో చక్కెర, ఉప్పు, కాస్త నెరుు్య, పాల పొడి, కస్టర్డ్ పొడిని కలిపి బిళ్లలుగా చేసి బట్టీలో నిప్పుల వేడిపై కాలుస్తారు. ప్రతి బేకరీలో వీటిని తయూరు చేస్తున్నారు. నిత్యం లక్షల్లో ఇవి స్వాహా అవుతుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బేకరీల్లో వీటి తయూరీపైనే దృష్టి సారిస్తుంటారు.