సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. కేసును సీబీఐకు ఇస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. రేపు(బుధవారం) మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment