సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నేడు హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. అయితే, ఈ కేసును సీబీఐకి ఇస్తుందా? లేక తీర్పును వెల్లడిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే, ఇప్పటికే ఈ కేసును సీబీఐతో విచారించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేసు తీర్పుపై సస్పెన్స్ నెలకొంది. ఇక, సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. ఈ కేసులో జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రిజర్వ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment