
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. సీబీఐ విచారణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు మాత్రం అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో ఏకీభవించింది హైకోర్టు. సిట్ ఏర్పాటును కొట్టేస్తూనే సిట్ విచారణ నిలిపివేతకు ఆదేశించింది. అలాగే.. కేసును సిట్ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది హైకోర్టు బెంచ్. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని సిట్ యోచిస్తోంది.
గత అక్టోబర్‌లో తెరపైకి వచ్చింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అధికార పార్టీ బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్) కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కుట్ర జరిగిందని, అందుకు రంగారెడ్డి మొయినాబాద్‌లోకి ఓ ఫామ్‌హౌజ్ వేదిక కావడం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment