కృష్ణజింక కేసులో సల్మాన్కు సుప్రీం నోటీసులు | supreme court issues notices to salman khan | Sakshi
Sakshi News home page

కృష్ణజింక కేసులో సల్మాన్కు సుప్రీం నోటీసులు

Jul 9 2014 11:34 AM | Updated on Sep 2 2018 5:20 PM

కృష్ణజింక కేసులో సల్మాన్కు సుప్రీం నోటీసులు - Sakshi

కృష్ణజింక కేసులో సల్మాన్కు సుప్రీం నోటీసులు

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ఖాన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్ఖాన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 1998లో రాజస్థాన్లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ కృష్ణజింకను, రెండు చింకారా జింకలను చంపిన కేసులో ఈ నోటీసులిచ్చింది. ఈ కేసులో సల్మాన్కు పడిన శిక్షను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అంతరించిపోతున్న జాతికి చెందిన జింకలను వేటాడి హతమార్చినట్లు సల్మాన్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో 1998లో ఒకసారి, 2007లో మరోసారి జోధ్పూర్ జైల్లో కూడా సల్మాన్ ఉన్నట్లు చెబుతారు. ఈ సినిమాలో సల్మాన్తో కలిసి నటించిన సైఫ్ అలీఖాన్, టబు, సోనాలిబెంద్రే, నీలమ్.. ఈ నలుగురు అతడిని వేటకు ప్రోత్సహించినట్లు ఆరోపణలున్నాయి.

సల్మాన్ రైఫిల్, రివాల్వర్ లైసెన్సుల కాలపరిమితి తీరిపోవడంతో వాటిని కోర్టు గతంలోనే స్వాధీనం చేసుకుంది. సినిమా షూటింగు కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా సల్మాన్ ఖాన్కు పడిన శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాజస్థాన్ హైకోర్టు గత నవంబర్లో ఆదేశాలిచ్చింది. ఐదేళ్ల జైలుశిక్ష పడిన సల్మాన్.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. దీంతో పాటు 2002లో ముంబైలో కారుతో ఢీకొట్టి, పారిపోయిన కేసులో కూడా సల్మాన్పై విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement